ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి దిమ్మ తిరిగిపోయేలా కొత్త వాహన చట్టంలో భారీ ఎత్తున జరిమానాలు విధిస్తుండటం తెలిసిందే. ఈ చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అమలు చేయలేదు. అయితే.. భారీ జరిమానాలపై ఇటీవల కాలంలో కొత్త వాదన తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. జరిమానాల్ని భారీగా వేయటం ఏమిటంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
రూల్స్ ఫాలో కాలేదని తమకు ఫైన్లు వేసే పోలీసులు.. రోడ్ల మీద ఉండే గుంతలు.. మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచే వాటికి ప్రజలకు ప్రభుత్వం కూడా ఫైన్లు చెల్లించాలంటూ కొత్త ప్రచారాన్ని షురూ చేయటం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎప్పుడో ఒక దగ్గర మొదలు కావాలని.. తప్పులు చేసిన వారికి భారీ చలానాలు వేయటం తప్పు కాదన్నారు. సిగ్నళ్ల దగ్గర జీబ్రా లైన్ల వద్ద ఆగితే తప్పేంటి? అని ప్రశ్నించిన ఆయన.. అలా ఆగకుండా వెళ్లే వారికి చలానాలు వేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.
అసలు పుట్ పాత్ లమీద బండ్లు ఎందుకు నడపాలి? రోడ్డు బాగుందా? లేదా? అన్న విషయాల్ని ఒక నిమిషం పక్కన పెడదామని.. జీబ్రా లైన్ దగ్గర ఆగటానికి ఇబ్బందేమిటి? అని ప్రశ్నించారు. జీబ్రా లైన్ల వద్ద మనుషులు రోడ్లు క్రాస్ చేయకూడదా? ఆ మాత్రం ఇంగితం లేని వారికి ఫైన్లు వేస్తే కామెంట్లు చేస్తే ఎలా? నన్నడిగితే అలాంటి వారికి చలానాలు వేయటంలో తప్పు లేదన్నారు.
కొత్త చట్టం ప్రకారం మన దగ్గర చలానాలు విధిస్తున్నట్లు లేదని.. దేశం బాగుపడాలంటే పౌరుల్లో క్రమశిక్షణ రావాలన్నారు. ఉల్లంఘనులు ఎవరైనా సరే.. సివిల్ డిసిప్లేన్.. సివిక్ సెన్స్ లేని వారికి ఫైన్ లు వేస్తే ఏ తప్పు లేదని.. దాన్ని ఎవరైనా తప్ప పడితే.. వాళ్లది కూడా తప్పేనని తేల్చేశారు కేటీఆర్. మరింత భారీ క్లాస్ తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంటుందో?