కేటీఆర్‌ కే సార‌థ్యం....పుర‌పోరుపై టీఆర్ ఎస్ రెడీ

Update: 2019-12-25 09:10 GMT
త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సొంతం చేసుకోవడం ల‌క్ష్యంగా టీఆర్‌ ఎస్ పార్టీ క‌దులుతోంది. జనవరి ఎనిమిదో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్న నేపథ్యంలో మొత్తం ఎన్నికల ప్రక్రియలో విజ‌యం సాధించడానికి  సన్నాహాలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే మున్సిపాలిటీలు పెరుగటం - ఓటర్ల సంఖ్య కూడా రెండింతలు కావడంతో పకడ్బందీగా ప్లానింగ్ జ‌రుగుతోంది. టీఆర్ ఎస్ ఎన్నిక‌ల ప్రణాళిక మొత్తం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చేతుల మీదుగా సాగ‌నుంద‌ని స‌మాచారం.

గ‌త కొద్దికాలంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపే ల‌క్ష్యంగా టీఆర్ ఎస్ పార్టీ ఎత్తుగ‌డ‌లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు మెజార్టీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ గెలుపు బాట‌లో సాగింది. ఇటీవ‌ల జ‌రిగిన హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ కేటీఆర్ నాయ‌క‌త్వంలోనే గులాబీ జెండా ఎగుర‌వేశారు. టీఆర్ ఎస్‌ కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ఉప ఎన్నిక విష‌యంలో కేటీఆర్ నాయ‌క‌త్వం విజ‌య‌వంతం అయిన‌ట్లే - పుర‌పోరును సైతం ఎదుర్కోవాలని టీఆర్ ఎస్ భావిస్తోంద‌ని స‌మాచారం. ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలతో టీఆర్‌ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది.

విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ డిసెంబర్ 27 న తిరిగి వస్తారని స‌మాచారం. అభ్యర్థులను ఖరారు చేయడంపై నిర్ణయం తీసుకునేందుకు - పార్టీ వ్యూహం ఖ‌రారు చేసేందుకు ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాల‌ని కేటీఆర్ నిర్ణ‌యించ‌న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా - మున్సిపల్‌ ఎన్నికలకు ముందే ఓ ద‌ఫా కేటీఆర్ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.
Tags:    

Similar News