తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణ విధానంలో పెను మార్పులు చోటు చేసుకునేలా.. పోలింగ్ విధానంలో కొంగొత్త మార్పులకు తెర తీసేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మారిన పరిస్థితులకు అనుగుణంగా..ఇప్పటివరకూ అనుసరిస్తున్న పోలింగ్ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయటం గమనార్హం. ఎన్నికల పోలింగ్ లో భాగంగా.. ఆన్ లైన్ లో కూడా ఓట్లు వేసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఆసన్నమైందంటూ ఆయన వ్యాఖ్యానించటం విశేషం.
రెండు రోజుల క్రితం ముగిసిన గ్రేటర్ ఎన్నికల్లోరాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ.. హైదరాబాద్ నగరజీవి ఓట్లు వేసే విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించటం.. కేవలం 45 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓటు మీద చైతన్యం రగిలించినా.. ఓట్లు వేసే విషయంలో ఓట్లర్లు అంత ఉత్సాహంగా ముందుకు రాని నేపథ్యంలో.. ఓటింగ్ ను ఆన్ లైన్లో కూడా నిర్వహిస్తే మంచిదన్న ఐడియాను కేటీఆర్ వ్యక్తం చేయటమే కాదు..ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందన్న మాటను చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ మాటను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.