సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. తెలంగాణలో డెవలప్ మెంట్ ఏ స్థాయిలో ఉందో.. తమ ప్రభుత్వ పని తీరు ఎంత బాగుందన్న విషయాన్ని చెప్పేందుకు కేటీఆర్ చెప్పిన ఒక ఉదాహరణ రెండుతెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు పనితీరును కళ్లకు కట్టినట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. సంక్రాంతి పండక్కి పక్క రాష్ట్రానికి వెళ్లి వచ్చిన తన స్నేహితుడు ఏం చెప్పాడన్న విషయాన్ని పిట్ట కథ రూపంలో చెప్పుకొచ్చారు.
కేటీఆర్ మాటల్లోనే చూస్తే.. 'నా ఫ్రెండ్ ఒకాయన ఉన్నాడు. ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి వెళ్లాడు. వారికి ఆ రాష్ట్రంలో తోటలు.. ఇళ్లు ఉన్నాయి. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. కేటీఆర్ గారు.. మీరో పని చేయండి. మీ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సుల్ని పెట్టి.. పక్క రాష్ట్రాలకు పంపియ్యండి సార్'' అని అన్నారన్నారు.
ఎందుకని తాను అడిగతే.. ''ఏం లేదు సార్.. నేను వెళ్లాను నాలుగు రోజులు.. సంక్రాంతికి మా ఊళ్లో ఉన్నాను. కరెంటు లేదు. నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి. అన్యాయంగా.. అధ్వానంగా ఉంది. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాతే నాకు ఊపిరి పీల్చుకున్నట్లుంది. మీరో పని చేయండి.. మనోళ్లను అక్కడికి పంపండి. అప్పటికి తెలిసి వస్తుంది మన విలువేమిటో.. మన ప్రభుత్వం చేసిన పనులేమిటోనని ఆయన కూడా చెప్పారు'' అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక్కసారి..ఒక్క ఛాన్సు ఇవ్వాలన్న జగన్ పాలనలో ఏపీ పరిస్థితి ఎలా మారిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పిన వైనం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఆయన వీడియో క్లిప్.. బ్రేకింగ్ న్యూస్ వేసిన చానళ్ల స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు ఏపీ అధికారపక్ష నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడి.. మాటలు వెతుక్కునే పరిస్థితి చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది.
Full View