రాజకీయ వారసత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రవేశానికి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందన్నారు. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరని తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని కేటీఆర్ గుర్తు చేశారు.
మొదటి సారి తాను సిరిసిల్లలో పోటీ చేసినప్పుడు తాను చాలా కష్టపడి గెలిచానన్నారు. తన పనితీరు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన సిరిసిల్లలో తన మెజారిటీ పెరిగిందన్నారు. తాను పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు ఎప్పుడో తనను పక్కన పడేసేవారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో వారసత్వ రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్.. తన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు, షడ్డకుడి కుమారుడు సంతోష్‌రావు ఇలా వారసత్వ రాజకీయాలకు పెద్దపీటు వేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మీడియా ఇన్ తెలంగాణ–పాస్ట్, ప్రసెంట్, ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ ప్రతిభ లేకున్నా రాజకీయాలు చేయొచ్చని కొందరు భావిస్తున్నారని అన్నారు. అయితే ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.
స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో పత్రికలు కీలక పాత్ర పోషించాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఏది న్యూసో, వ్యూసో తెలుసుకోవడానికి అనేక పత్రికలు చదవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని.. పత్రికలు కూడా ఈ ఐదు కేటగిరీలకే ప్రాధాన్యతనిస్తున్నాయని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో మీడియా యాజమాన్యాలు తమకు వ్యతిరేకంగా వ్యవహరించాయన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. తొలినాళ్లలో కేసీఆర్ చిత్తశుద్ధిని కూడా శంకించారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని ఎదుర్కొని ఉద్యమం తాము ఉద్యమం నడిపించామని కేటీఆర్ గుర్తు చేశారు.
షోయబుల్లా ఖాన్ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తి అని కేటీఆర్ చెప్పారు. అలాగే గోలకొండ పత్రికతో సురవరం పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. జర్నలిజం ముసుగులో ఇప్పుడు వ్యక్తిగత దూషణలు చేయడంతోపాటు బూతులు తిడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా రాసిన పత్రికలపై కేటీఆర్ సెటైర్లు సంధించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.