రేవంత్ థ‌ర్డ్ గ్రేడ్ క్రిమిన‌ల్‌.. దొంగ‌: కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్లు

Update: 2021-09-16 16:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సార‌థి.. ఎంపీ.. రేవంత్‌రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి, టీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విరుచుకుప‌డ్డారు. `రేవంత్ థ‌ర్డ్ గ్రేడ్ క్రిమిన‌ల్‌, ఓ దొంగ‌.. ఇలాంటి వ్యాక్తా.. కాంగ్రెస్‌ను లీడ్ చేసిది` అంటూ.. నిప్పులు చెరిగారు. దీంతో మ‌ళ్లీ కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ రాజ‌కీయాలు భారీ రేంజ్‌లో హీటెక్కాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు కేటీఆర్ ఈ రేంజ్‌లో రేవంత్‌పై ఫైర‌య్యారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగిందంటే..
తెలంగాణ ప్ర‌భుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌.. అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. హైద‌రాబాద్‌ను మ‌రింత‌గా ఐటీలో అభివృద్ధి చేస్తున్నారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో అనేక ఐటీ సంస్థ‌ల ఏర్పాటు కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయా కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌స్తుతం పార్ల‌మెంట‌రీ.. ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ.. శ‌శిథ‌రూర్‌.. హైద‌రాబాద్ వ‌చ్చారు. గ‌త వారం జ‌రిగిన ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఇక్క‌డి విష‌యాల‌ను నిశితంగా గ‌మ‌నించారు.

అనంత‌రం.. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కొనియాడారు. ఐటీ రంగంలో ఆవిష్క‌ర‌ణ‌ల కు తెలంగాణ వేదిగా నిలుస్తోంద‌ని శ‌శిథ‌రూర్ పేర్కొన్నారు. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు తెలంగాణ ఒక ఉదాహ‌ర‌ణ గా నిలుస్తుంద‌ని కూడా పేర్కొన్నారు. స‌హ‌జంగానే ఇది రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌కు రుచించ‌ని అంశం.  అయిన‌ప్ప‌టికీ.. పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘం చైర్మ‌న్‌గా ఉన్నారు క‌నుక శ‌శిథ‌రూర్ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, రేవంత్ రెడ్డి ఈ విష‌యంలో వేలు పెట్టారు.

శ‌శిథ‌రూర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రేవంత్ తీవ్రంగానే స్పందించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ప్రెస్ మీటింగ్‌లో శ‌శిథ‌రూర్‌పై తీవ్ర ప‌ద‌జాలం వినియోగించి మ‌రీ రేవంత్ తిట్టిపోశారు. ``థ‌రూర్ ఇక్క‌డివాడు కాదు. ఎక్క‌డో తిరువ‌నంత‌పురం నుంచి వ‌చ్చాడు. ఆయ‌నో గాడిద‌. ఇలాంటి వాళ్ల‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించాలి`` అని కామెంట్లు కుమ్మ‌రించారు.

ఇక‌, రేవంత్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. మ‌రుస‌టి రోజు రేవంత్ వ్యాఖ్య‌లతో వ‌చ్చిన వార్తా పేప‌ర్ల క‌టింగుల‌ను జోడిస్తూ.. ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు.``స్థాయీ సంఘం చైర్మన్‌గా శ‌శిథ‌రూర్‌.. ఉన్న విష‌యాన్ని చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న అంశాల‌ను ప్ర‌శంసించారు`` అని పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో.. ``పార్ల‌మెంటులో శ‌శిథ‌రూర్‌కు స‌హ స‌భ్యుడు, ప్ర‌స్తుత పీసీసీ ``చీప్‌`` ఆయ‌న‌ను గాడిద‌గా అభివ‌ర్ణించారు. ఇది చాలు.. ఆయ‌న నాయ‌క‌త్వం ఏంటో చెప్ప‌డానికి. ఆయ‌నో థ‌ర్డ్ గ్రేడ్ క్రిమిన‌ల్‌, ఓ దొంగ. ఇలాంటి వారా పార్టీని న‌డిపించేది?`` అని ట్విట్ట‌ర్‌లో నిప్పులు చెరిగారు.  

పార్ల‌మెంటుకు సంబంధించి అనేక స్థాయి సంఘాలు ఉన్నాయ‌ని.. ఆయా స‌బ్జెక్టుల‌పై అవి ప‌రిశీలించి సూచ‌న‌లు చేస్తాయ‌ని.. రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తాయ‌ని.. కేటీఆర్ పేర్కొన్నారు. ఇది దేశానికి ఎంతో ఉప యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. కానీ, రేవంత్ ఆయా విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి కేవ‌లం రాజ‌కీయాలే చూడ‌డం దారుణ‌మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, రేవంత్ వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీలోనూ భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌లు పార్టీకి డ్యామేజీగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. 
Tags:    

Similar News