ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పేరు వింటేేనే జనం వణికిపోతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటిస్తుంటే... జనం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఓ వైపు లాక్ డౌన్ ముమ్మరంగా జరుగుతున్నా... మరోవైపు కరోనా విజృంభణ తనదైన రేంజిలో సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రోజూ కొత్త కేసులు నమోదు అవుతుండగా... వాటి సంఖ్య దాదాపుగా 67కి చేరిపోయింది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారందరికీ ప్రభుత్వం పకడ్బందీగా చికిత్సలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరు దిశగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఆదివారం ఒకే రోజు కరోనా పాజిటివ్ గా తేలిన కేసుల్లో ఏకంగా 11 కేసులు నెగెటివ్ గా మారాయి.
ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఐటీ - మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభవార్తగా మార్చేసి చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్ వచ్చిన 11 కేసులు చికిత్స అనంతరం ఆదివారం జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని కేటీఆర్ పంచుకున్నారు. అంతకు క్రితం ప్రపంచ వ్యాప్త కరోనా మరణాల గ్రాఫ్ గురించి కూడా ఆయన చర్చించారు. కరోనా పోరులో ప్రపంచ దేశాల కంటే భారత్ ఎంతో ముందుందని, చైనా కంటే ఇటలీ - స్పెయిన్ - యూకే - యూఎస్ లలో కరోనా వైరస్ మరణాల రేటు వేగంగా పెరుగుతోందని తెలిపారు.
ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా తెలంగాణలో కరోనా వైరస్ 67 మందికి సోకింది. వీరిలో ఒకరు మరణించారు. ఆదివారం 11 మందికి నెగెటివ్ అని రాగా... ఇంతకుముందే.. మరొకరికి నెగెటివ్ అని వచ్చింది. మొత్తంగా కరోనా బారినపడి ఆ వైరస్ ముప్పు నుంచి బయటపడిన వారి సంఖ్య తెలంగాణలో 12గా తేలింది. మిగిలిన వారికి కూడా చికిత్సలు కొనసాగుతున్నాయి. వారిలో చాలా మంది కూడా పాజిటివ్ నుంచి నెగెటివ్ గా మారే దిశగా త్వరగానే కోలుకుంటున్నట్లుగా సమాచారం. ఇలాంటి నేపథ్యంలో ఆదివారం ఒకే రోజు ఏకంగా 11 మంది ఈ వైరస్ నుంచి బయటపడటం నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమే కదా. అందుకే కేటీఆర్ ఈ విషయాన్ని గుడ్ న్యూస్ అంటూ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.