ఆ ఇబ్బందిని మా బాగా డీల్ చేసిన కేటీఆర్‌!

Update: 2017-11-29 08:16 GMT
ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం కామ‌న్‌. అలాంటి వేళ‌లో ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న దానిపైనే స‌ద‌రు వ్య‌క్తి స‌మ‌ర్థ‌త ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. డిజిట‌ల్ ప్ర‌పంచంలో ప్ర‌తిది కెమేరా కంట్లో ప‌డుతున్న వేళ‌లో ఏ చిన్న త‌ప్పిదం జ‌రిగినా.. స‌ద‌రు వ్య‌క్తి మీద ప‌డే ప్ర‌భావం అంతా ఇంతా కాదు. ఇక‌.. ప్ర‌ముఖ‌ల‌కైతే నిప్పుల మీద న‌డ‌కే అవుతుంది.
 
జీఈఎస్ స‌ద‌స్సు సంద‌ర్భంగా అనుకోని ఇబ్బందిని ఎదుర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. అయితే.. త‌న‌దైన స‌మ‌య‌స్ఫూర్తితో ఎదుర్కొన్న వైనం కెమేరా కంటికి చిక్కింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక‌.. బ్రిట‌న్ మాజీ అధ్య‌క్షుడు టోనీ బ్లెయిర్ స‌తీమ‌ణి చెర్రీ బ్లెయిర్‌.. డెల్ సీఈవో క్వింటోస్‌.. ఐసీఐసీఐ బ్యాంక్  ఎండీ చందా కొచ్చ‌ర్ లాంటి మ‌హిళా మ‌ణుల మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ‌కు మెంటార్ గా వ్య‌వ‌హ‌రించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.

పూర్తి స‌బ్జెక్టివ్ గా సాగిన ఈ చ‌ర్చ‌లో అప్ప‌టికే త‌న మార్క్ ను ప్ర‌ద‌ర్శించారు కేటీఆర్‌. ఎందుకంటే.. టాప్ కార్పొరేట్ కంపెనీల్లో కీల‌క‌భూమిక పోషించే మ‌హిళ‌ల మ‌ధ్య‌న వ్యాపార అవ‌కాశాల మీద చ‌ర్చ‌కు మెంటార్ గా ఉండ‌టమంటే  మాట‌లు కాదు.
ఇదిలా ఉంటే.. చ‌ర్చాకార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముగిసిన త‌ర్వాత అంద‌రూ క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చారు. వేదిక మీద ఏ వ‌రుస క్ర‌మంలో అయితే కూర్చున్నారో.. అదే వ‌రుస‌లో కాస్త ద‌గ్గ‌ర‌గా ఫోటోల‌కు ఫోజులిచ్చారు. న‌లుగురు మ‌హిళా ప్ర‌ముఖుల మ‌ధ్య కేటీఆర్ ఫోటోల‌కు ఫోజులిచ్చారు. ఇక్క‌డే అస‌లు ఇబ్బంది ఎదురైంది. ఫోటో సెష‌న్ ముగిసిన వెంట‌నే కేటీఆర్‌.. ఐసీఐసీఐబ్యాంక్ ఎండీ చందా కొచ్చ‌ర్ తో మాట్లాడారు. దీంతో వారికి మ‌ధ్య‌గా ఉన్న ఇవాంక కాస్త వెన‌క్కి జ‌రిగారు. వారి మ‌ధ్య మాట‌లు క్ష‌ణాల్లో ముగిశాయి.

ఆ వెంట‌నే చందాతో ఇవాంకా మాట్లాడ‌టం.. కేటీఆర్ స‌ర్దుకొని ప‌క్క‌కు చూసేస‌రికి  చెర్రీ బ్లెయిర్ వేరే వారితో మాట్లాడుతుండ‌టంతో కేటీఆర్‌కు మ‌హా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. ఆ స‌మ‌యంలో భుజాల‌ను ఎగుర‌వేసి.. చేతుల్ని ఒక ద‌గ్గ‌ర‌కు తెచ్చేసిన ఆయ‌న‌.. ఇవాంక కోసం ఎదురుచూశారు. చందాతో మాట్లాడ‌టం అయిన వెంట‌నే ఇవాంక‌తో మాట్లాడారు కేటీఆర్. అయితే ఇందుకోసం కొన్ని క్ష‌ణాలు ఖాళీగా వేదిక మీద ఒక్క‌డిగా ఉండిపోవాల్సింది. ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని స‌మ‌ర్థంగా డీల్ చేసిన కేటీఆర్ తీరు ఆక‌ట్టుకునేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Full View

Full View
Tags:    

Similar News