లోకేష్ కు స్పీడున్నోడి షాక్

Update: 2016-02-06 06:05 GMT
ఎప్పుడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారుడు ముఖాముఖిన తలపడ్డారు. ఇంతవరకూ వీరిద్దరూ ఇలా తలపడింది లేదు. వ్యక్తిగత ప్రతిష్ఠగా భావించి గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని తమ భుజాల మీద వేసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ లు ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం చేశారు. ఒకరికి మించిన పంచ్ లు మరొకరు వేసుకోవటం కనిపించింది.

లోకేశ్ ను ‘‘తమ్ముడూ’’ అని కేటీఆర్ సంబోధిస్తే.. కేటీఆర్ ను ‘అన్నయ్య’ అంటూ లోకేశ్ ఓకే చేయటం కనిపించింది. మాటల దాడి చేసుకునే సమయంలో చాలానే మాటలు దొర్లాయి. స్టేట్ గెస్ట్ వి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తే.. నేనే అసలుసిసలు హైదరాబాదీని అంటూ లోకేశ్ చెప్పటమే కాదు.. కేటీఆర్ గుంటూరు లెక్కను విప్పి చెప్పి దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. మొత్తంగా కేటీఆర్ గుంటూరులో చదువుకున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించటంతో పాటు.. తాను అసలుసిసలు హైదరాబాదీనని స్పష్టం చేసే ప్రయత్నంలో లోకేశ్ సక్సెస్ అయ్యారు.

లోకేశ్ వ్యాఖ్యల్ని తిప్పి కొట్టే క్రమంలో.. తెలంగాణలోనే పోటీ చేస్తావా? అంటూ కేటీఆర్ వేసిన సూటి ప్రశ్నకు లోకేశ్ బదులివ్వకపోవటం మర్చిపోకూడదు. కేటీఆర్ మాటలు తూటాల్లా పేలితే.. లోకేశ్ మాటలు అంత ఆకట్టుకునేలా లేకుండా సాగాయి. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో తన తల్లి భువనేశ్వరి తన ఓటును టీఆర్ ఎస్ కు ఓటేస్తానని చెప్పినట్లుగా తమ కార్యకర్తల ద్వారా తనకు తెలిసిందని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తే.. దాన్ని తిప్పికొట్టటంతోపాటు.. వేలాదిమంది ముందు కేసీఆర్ ఇన్ని అబద్ధాలు ఎలా ఆడతారన్న మాటను ప్రభావవంతంగా చెప్పటంలో లోకేశ్ ఫెయిల్ కావటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకట్టుకునేలా మాట్లాడే విషయంలో ఆయన మరింత రాటు దేలాల్సి అవసరం ఉంది.

మొత్తంగా చూస్తే.. గ్రేటర్ ఎన్నికల్లో గుంటూరు అన్నయ్య కేటీఆర్ (విద్యార్థిగా గుంటూరులో కేసీఆర్ చదువుకున్నారు) ధాటికి.. తాను అసలుసిసలు హైదరాబాదీనని చెప్పుకున్న తమ్ముడు లోకేశ్ (పుట్టింది.. పెరిగింది.. చదువుకున్నది హైదరాబాద్ లోనే) కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News