తిరుగులేని రాజకీయ అధినేతలుగా గుర్తింపు పొందిన వారి రాజకీయ వారసులు వారి స్థాయిలో మెరిసిన దాఖలాలు పెద్దగా కనిపించవు. అది గాంధీ కుటుంబం నుంచి ఎన్టీఆర్ కుటుంబం వరకు. ఆ మాటకు వస్తే.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ అధినేతల పిల్లల్లో వారికున్న టాలెంట్ పెద్దగా కనిపించని పరిస్థితి.
ఈ విషయంలో ఏమైనా మినహాయింపులు ఉన్నాయంటే.. ఆ జాబితాలో మొదటగా నిలిచే పేరు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అనే చెప్పాలి. ఓవైపు తన స్థాయిని అంతకంతకూ విస్తరించుకునే కేటీఆర్.. తనకు పోటీగా నిలిచే వారందరిని వైట్ వాష్ చేసుకుంటూ పోయే టాలెంట్ ఆయన సొంతంగా చెప్పాలి.
కొన్ని చోట్ల తగ్గినట్లే కనిపించే కేటీఆర్ ను చూస్తే.. వినయ విధేయ రామ అన్న మాట చప్పున గుర్తుకురాక మానదు. తానో ముఖ్యమంత్రి కుమారుడినని.. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు అభివర్ణించే కేటీఆర్ .. ప్రస్తుతం తెలంగాణకు డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారన్న మాట రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. తన తండ్రి తిరుగులేని రాజకీయ అధిక్యత ఉందన్న భావన కేటీఆర్ లో అస్సలు కనిపించదు.
తనకంటే వయసులో కాస్త పెద్ద అయినా సరే 'అన్నా' అంటూ పిలవటం.. వారికి స్థాయికి ఏ మాత్రం తగ్గని రీతిలో గౌరవ మర్యాదల్ని ప్రదర్శించటం.. తిరుగులేని అధికారం చేతిలో ఉన్నా.. దాన్ని ప్రదర్శించే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే గుణం కేటీఆర్ సొంతంగా చెప్పాలి. తాజాగా కర్ణాకట రాజధాని బెంగళూరుకు తన టీంతో వెళ్లిన ఆయన.. హైదరాబాద్ మహానగరానికి ఏకంగా రూ.24 వేల కోట్ల పెట్టుబడుల్ని ఒకే కంపెనీ ద్వారా తీసుకురావటం.. దానికి సంబంధించిన ఒప్పందం మీద ఆదివారం సంతకాలు చేయటం తెలిసిందే.
రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీ ప్రదాన కార్యాలయం బెంగళూరులో ఉంటే.. అక్కడకే వెళ్లిన కేటీఆర్.. ఇరు వర్గాలు సంతకాలు పెట్టుకునే కార్యక్రమంలో ఎంత శ్రద్ధగా పరిశీలిస్తున్నారన్న విషయంపై తాజా ఫోటోనే నిదర్శనంగా చెప్పాలి.
ఇరు వర్గాల వారు ఒప్పంద పత్రాల మీద సంతకం చేస్తున్నప్పుడు తన అధికార దర్పాన్ని ప్రదర్శించాలనే దాని కంటే.. వారితో కలిసిపోయి.. వారిలో ఒకడిగా ఉన్నట్లుగా ఉండే కేటీఆర్ తీరును అభినందించకుండా ఉండలేం. ఈ ఫోటోను చూసినంతనే వినయ విధేయ రామ అన్న భావన మనసులోకి రావటం ఖాయం. కాదంటారా?