తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు..రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో రికార్డు చేరనుంది. వచ్చే జనవరి నుంచే ఆయన ఖాతాలో ఈ రికార్డు చేరనుందని మంత్రి సన్నిహితవర్గాలు అంటున్నాయి. ఇంటర్నెట్ సౌలభ్యాన్ని ఇంటింటికీ అందించడంతో పాటు - పౌరసేవలను ప్రజల ముంగిటికి చేర్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ ఇంటర్నెట్ పైలట్ ప్రాజెక్టును వచ్చే నెలలో మహేశ్వరంలో ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ దశలోనే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అంతర్జాతీయ దిగ్గజాలు సిద్ధమయ్యాయి.
సామాన్యులకు కూడా సాంకేతిక విప్లవ ఫలాలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ టీ ఫైబర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులతో అనుసంధానం చేయడం వల్ల ఫైబర్ గ్రిడ్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 27,000 కిలోమీటర్ల మేర ప్రధాన ఆప్టిక్ ఫైబర్ వేశారు. డిసెంబర్ 2018 నాటికి పూర్తిస్థాయిలో ఆప్టిక్ ఫైబర్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా లక్షా 20వేల కిలోమీటర్ల వరకు ఆప్టిక్ ఫైబర్ లైన్లు వేస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.5500 కోట్లు కాగా - మిషన్ భగీరథతో సమన్వయం చేసుకోవడం వల్ల డక్ట్ ల తవ్వకంలో రూ.1500 కోట్లు ఆదా అయ్యాయి. దీనికి భారత్ నెట్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,242 కోట్లు అందించనుంది. మిగతా మొత్తాన్ని రుణం రూపంలో రాష్ట్రం ప్రభుత్వం పొందనుంది.
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రారంభానికి ముందే ప్రముఖ సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే సిస్కో - హెచ్ పీ - ఎల్ ఆండ్ టీ - టెరాసాఫ్ట్ - కార్పస్ - తేజాస్ నెట్ వర్క్ - డీలింక్ - ఇంటెక్స్ - స్మార్ట్రాన్ - హెచ్ ఎఫ్ సీఎల్ గ్రూపులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ముందుకొచ్చాయి. ఫైబర్ గ్రిడ్ ద్వారా అందించే సేవలను పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరంలో చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలు సంస్థలు దాదాపు రూ.11 కోట్ల పెట్టుబడితో భాగస్వామ్యం పంచుకున్నాయి. టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ నెట్ వర్క్ పేరుతో మహేశ్వరం తదితర 4 గ్రామాల్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. తొలిదశలో వచ్చే జనవరి నుంచి ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి.
మొత్తంగా ఇప్పటికే తనదైన శైలిలో ఐటీ - పరిశ్రమల రంగంలో ముద్రవేసిన కేటీఆర్...టీ హబ్ - టాస్క్ వంటి కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి తోడుగా ఇంటింటికీ ఇంటర్నెట్ తో వచ్చే ఏడాది నుంచి మరో రికార్డును సొంతం చేసుకోనున్నారని అంటున్నారు.