బాబును కేటీఆర్ భ‌లే ఆడుకున్నాడు

Update: 2018-11-02 10:32 GMT
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు - ఇరు పార్టీల అధినేతల భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావ‌త్ భార‌త‌దేశంలో హాట్ టాపిక్‌. బీజేపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా రాహుల్ గాంధీతో చంద్ర‌బాబు నాయుడు జ‌త క‌ట్ట‌డాన్ని కొంద‌రు విమ‌ర్శిస్తుండ‌గా మ‌రికొంద‌రు స్వాగ‌తిస్తున్నారు. రాహుల్‌ - బాబుల భేటీపై సోష‌ల్ మీడియాలోనూ ప‌లు మీమ్‌ లు వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో టీడీపీపై కాంగ్రెస్ చేసిన విమ‌ర్శ‌లు - కాంగ్రెస్‌ పై టీడీపీ నేత‌లు సంధించిన వాగ్బాణాల‌ను చాలామంది నెటిజ‌న్లు గుర్తుచేస్తున్నారు. అవ‌న్నీ మ‌రిచి ఇప్పుడీ అనైతిక పొత్తు ఎందుకంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రి సోష‌ల్ మీడియాలో ఇంత‌లా రచ్చ జ‌రుగుతుంటే టీఆర్ ఎస్ నేత కేటీఆర్ ఎందుకు కామ్‌ గా ఊరుకుంటారు? అందుకే త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీలైన కాంగ్రెస్‌ - టీడీపీల‌పై త‌న ప్ర‌సంగాల్లో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇరు పార్టీల అధినాయ‌కుల‌ను ఏకిపారేస్తున్నారు. తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబుపై ఆయ‌న చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌ గా మారుతోంది. అరే.. చంద్ర‌బాబును కేటీఆర్ భ‌లే అడుకుంటున్నాడే అంటూ ప‌లువురు న‌వ్వుకుంటున్నారు.

ఇంత‌కీ కేటీఆర్ త‌న ట్వీట్‌ లో ఏమ‌న్నారు? ఆ ట్వీట్‌ ఎందుకంత వైర‌ల్ అవుతోంది? అని ఆలోచిస్తున్నారా.. ఎక్కువ‌గా ఆలోచించ‌కండి. బుర్ర‌లు బ‌ద్ధ‌లు కొట్టుకోకండి. నిజానికి కేటీఆర్ త‌న ట్వీట్‌ లో చంద్ర‌బాబును ఒక్క తిట్టూ తిట్ట‌లేదు. ఒక్క మాట కూడా అన‌లేదు. కేవ‌లం చంద్ర‌బాబు గ‌తంలో వివిధ సంద‌ర్భాల్లో చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్ల‌నే తిరిగి పోస్ట్ చేశారు. చంద్ర‌బాబు చెప్పిందే తాను చెబుతున్నాన‌ని.. త‌న‌కేం తెలియ‌ద‌ని టూకీగా ఓ వ్యాఖ్య వాటికి జ‌త చేశారు.

కేటీఆర్ పోస్ట్ చేసిన చంద్ర‌బాబు ట్వీట్లు ఇవిగో..

 * "అవినీతి కాంగ్రెస్ నుంచి దేశానికి స్వాతంత్ర్యం తేవడమే నా లక్ష్యం. అందుకోసం ఏమైనా చేస్తాను"

* "రాహుల్ ను ప్రధానిగా చేయాలన్న ఏకైక వ్యక్తిగత ఎజెండాతో దేశ భవిష్యత్తును సోనియా గాంధీ ప్రమాదంలోకి నెడుతున్నారు"

* "ఏపీ కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ కాళ్లపై పడిపోయారు. ఇప్పుడు 1983 రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుంది"

* "అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకించారు. ఎన్డీయేకు ఓటిసిన వారందరికీ ధన్యవాదాలు"

ఈ ట్వీట్ల స్క్రీన్ షాట్ల‌ను కేటీఆర్ పోస్ట్ చేశారు. దీంతో చంద్ర‌బాబు మాట‌ల‌నే చెప్తూ ఆయ‌న మైలేజీపై కేటీఆర్ బాగా దెబ్బ కొట్టారే అని రాజ‌కీయ‌వ‌ర్గాలు - ప్ర‌జ‌లు చెవులు కొరుక్కుంటున్నారు.
Tags:    

Similar News