వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి కేటీఆర్ పోటీ

Update: 2016-01-08 06:45 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా మాటల మాంత్రికుడుగా మారుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే తెగ పర్యటిస్తున్న ఆయన తన పర్యటనల్లో చెబుతున్న మాటలు వింటుంటే టీడీపీ నేతలకు దిమ్మ తిరుగుతోందంట. తాజాగా ఆయన సంచలన కామెంట్ చేశారు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని త్వరలో తెలుగు రాష్ట్రాల సమితి పార్టీగా మార్చేస్తామని.. తాను పోటీ చేస్తే భీమవరం నుంచి పోటీ చేస్తానని అన్నారు.
          
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లొచ్చిన తరువాత కొన్నాళ్లకు ఏపీ మంత్రి ఒకరు కేటీఆర్ ను కలిశారట..ఆయన కుమార్తె పెళ్లికి కేటీఆర్ ను ఆహ్వానించేందుకు ఆయన వచ్చారు. ఆ సమయంలో ఆయన అమరావతి సభకు కేసీఆర్ రావడం గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలకు తమ సీఎం మాట్టాడినప్పుడు కంటే ఎక్కువగా చప్పట్లు కొట్టారని అన్నారట. దీంట్లో కిటుకేమిటో మీకు తెలుసా? కేటీఆర్ కు మంచి మిత్రుడైన ఆ ఏపీ మంత్రి అడిగారట... అందుకు స్పందనగా కేటీఆర్ ఆ కిటుకేమిటో చెప్పకపోయినా ఇంకో మాట చెప్పారట. మా సీఎంకు ఏపీలో వచ్చిన ఆదరణ చూశాక అక్కడా పోటీ చేయాలనుకుంటున్నాం. టీఆరెస్ ను తెలుగు రాష్ట్రాల సమితిగా మారుస్తాం. అప్పుడు నేను పోటీ చేయాల్సిన నియోజకవర్గాన్ని కూడా ఆల్రెడీ ఎంచుకున్నాను. భీమవరంలో పోటీ చేస్తాను.. అక్కడైతే నేను ఈజీగా గెలుస్తాను అని చెప్పారట. గెలుపుపై అంత నమ్మకం ఏంటి అని ఆయన అడగ్గా... ఏముంది.. కోడిపందేలు లీగలైజ్ చేస్తానని చెబుతా, అందరూ నాకే ఓటేస్తారు అన్నారట.  ఈ ముచ్చటంతటినీ ఆయన హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో చెప్పుకొచ్చారు.  దీంతో అక్కడ నవ్వులు పూశాయి. అయితే... ఇదంతా గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల కోసం చెప్తున్నదేనని అంటున్నారు. కోడిపందేలు వంటి గోదావరి జిల్లాల సంప్రదాయాలను తెరపైకి తెచ్చి వారిని ఆకట్టుకునేందుకే కేటీఆర్ ఇలంటి సరదా మాటలు చెప్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా కేటీఆర్ ఎత్తుగడను మాత్రం మెచ్చుకోక తప్పదు. ఉద్యమ పార్టీగా వచ్చి... సీమాంధ్రులను ధ్వేషించి ఇప్పుడు భీమవరంలో పోటీ చేస్తానని చెప్పడం చిన్న విషయం కాదు.
Tags:    

Similar News