మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం అనూహ్యంగా తప్పిపోయారు. తిరుమల కొండపై ఆయన కుటుంబసభ్యుల నుంచి తప్పిపోవడంతో ఆయన కోసం వెతుకుతున్నారు.
ఉమ్మడి రాష్ఱ్టంలోని బూర్గంపహాడ్ నియోజకవర్గం నుంచి ఆయన గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శనివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. హుండీలో కానుకలు వేసే సమయంలో తొక్కిసలాట జరగటంతో బిక్షం తప్పిపోయారు. ఆయన కొద్దికాలంగా అల్జీమర్స్ తో బాధపడుతుండడంతో మతిస్థిమితం కోల్పోతున్నారు. దీంతో ఆయన మళ్లీ తనకు తానుగా కుటుంబ సభ్యులను కలుసుకోలేకపోయారు.
కాగా భిక్షం తప్పిపోవడంతో కుటుంబసభ్యులు - ఆయన వియ్యంకుడు ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర తదితరులు తిరుమలలోనే ఉండి వెతుకుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా భిక్షం కోసం అన్వేషిస్తున్నారు. భిక్షం కుటుంబం గుడిలోకి వెళ్లినప్పటి నుంచి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరిగా ఆయన శ్రీవారి హుండీ వద్ద కనిపించారు. హుండీ సమీపంలో కుంజా భిక్షంతో పాటు ఆయన కుమార్తె - అల్లుడు కూడా కనిపించారు. ఆపై మరెక్కడా ఆయన జాడ తెలియలేదు. ఆలయం లోపలి మిగతా కెమెరాలు - బయట కెమెరాలు పరిశీలించినా జాడ కనిపించలేదు. కాగా, లోపల తాము హుండీ దగ్గర ఉన్న సమయంలో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చారని, ఆ సమయంలో రోప్ పార్టీ తమను తండ్రితో వేరు చేసిందని ఆయన కుమార్తె చెప్తున్నారు.
సీసీ టీవీ కెమేరాల్లోనూ ఆయన జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఇది సవాల్ గా మారింది. అయినా.. కూడా ఆయన ఎక్కడున్నారో వెతికి కుటుంబానికి అప్పగిస్తామని పోలీసులు చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/