ఉన్న‌దే 14 మంది!.. వారిలో స‌గం డుమ్మా!

Update: 2019-04-20 04:10 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు... అటు విప‌క్ష వైసీపీతో పాటు ఇటు అధికార పార్టీ టీడీపీకి కూడా అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లుగానే భావించాలి. ఈ మాట‌ను ఇటు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు అటు టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్శ‌ర్మ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా ప‌దే ప‌దే చెప్పిన వైనం మ‌న‌కు తెలిసిందే క‌దా. కీల‌కమైన ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిది? ఓడిపోయేదెవ‌రు? అన్న విష‌యం తెలిసేందుకు ఇంకా 36 రోజుల స‌మ‌యం ఉంది. అయితే పోలింగ్ ముగిసిన త‌ర్వాత జ‌గ‌న్ మీడియా ముందుకు వ‌చ్చి విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా మీడియాను పిలిచి మ‌రీ... ఎందుక‌నో తెలియ‌దు గానీ... ఆ మీడియా మీట్ ను అప్ప‌టిక‌ప్పుడే ర‌ద్దు చేసేసుకున్నారు. జ‌గ‌న్ ధీమా - చంద్ర‌బాబు భ‌యాల‌ను అంచ‌నా వేసిన చాలా మంది వైసీపీదే విజ‌య‌మ‌ని లెక్క‌లేస్తున్నారు.

అయితే పోలింగ్ ముగిసిన మ‌రునాడు గానీ... షాక్ నుంచి తేరుకున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు... ఈ సారి కూడా అధికారం త‌మ‌దేన‌ని చెప్ప‌డం మొద‌లెట్లారు. అయితే పోలింగ్ లో ఎన్నెన్నో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని - త‌న ఓటు త‌న‌కే ప‌డిందా? అంటూ త‌న‌దైన శైలి అనుమానాలను వ్య‌క్తం చేస్తున్న చంద్ర‌బాబు తీరు చూస్తుంటే... నిజంగానే వైసీపీనే గెలిచేసిందా? అన్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలా ప్ర‌తి చిన్న విష‌యంలోనూ ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భావ‌న‌తో అడ్డంగా దొరికిపోతున్న చంద్ర‌బాబుకు కర్నూలు జిల్లాలో శుక్ర‌వారం పెద్ద షాకే త‌గిలింది. నిత్యం స‌మీక్ష‌లంటూ కాల‌యాప‌న చేసే చంద్ర‌బాబు... ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో కూర్చుని అధికారుల‌తో చిట్ చాట్ కుద‌ర‌దు క‌దా. అందుకే పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష‌లంటూ బ‌య‌లుదేరిన చంద్ర‌బాబుకు క‌ర్నూలు జిల్లా తెలుగు త‌మ్ముళ్లు పెద్ద షాకే ఇచ్చారు.

జిల్లాలో ఎన్నిక‌ల స‌ర‌ళిపై మాట్లాడ‌దాం ర‌మ్మంటూ క‌ర్నూలు జిల్లా ఓర్వ‌కల్లులోని హ‌రిత రిసార్ట్ కు జిల్లాలో టీడీపీ అభ్య‌ర్థులంద‌రికీ క‌బురు పెట్టారు. అయితే ఈ భేటీకి స‌గానికి సగం మంది డుమ్మా కొట్టేశారు. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ - రెండు పార్ల‌మెంటు సీట్లున్నాయి. చంద్ర‌బాబు స‌మావేశానికి మాత్రం అఖిల ప్రియ - బుడ్డా రాజేశేఖర్‌ రెడ్డి - కేఈ శ్యాంబాబు - టీజీ భరత్‌ - తిక్కారెడ్డి - మీనాక్షి నాయుడు - కేఈ ప్రతాప్‌ లు గైర్హాజయ్యారు. తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ గాయం కార‌ణంగా ఆయ‌న గైర్ఝాజ‌రీకి ఓ రీజ‌నుంది. మ‌రి మిగిలిన ఆరుగురు ఎందుకు రాలేద‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఓట‌మి భ‌యంతోనే వారంతా స‌మీక్ష‌కు రాలేదా? అంటూ కొంద‌రు విశ్లేషిస్తుంటే... ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు టీడీపీ ఓట‌మికి స్ప‌ష్ట‌మైన సంకేతాలేన‌ని మ‌రికొంద‌రు విశ్లేషిస్తున్నారు.


Tags:    

Similar News