బాబుకు షాక్‌: జ‌గ‌న్ చెంత‌కు టీడీపీ నేత‌లు

Update: 2017-11-18 10:31 GMT
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు గ‌ట్టి షాక్ త‌గిలింది! ఇప్ప‌టి వ‌ర‌కు విప‌క్షం వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు - నేత‌ల‌ను చేర్చేసుకుని రాష్ట్రంలో ఏకైకా పార్టీగా అవ‌త‌రించాల‌ని క‌ల‌లు గంటున్న బాబుకు గ‌ట్టి  షాకిచ్చేలా ఇప్పుడు టీడీపీ నుంచి కూడా జంపింగ్‌ లు జ‌రిగిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీ నేత‌లు పార్టీ మారుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర అట్ట‌హాసంగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డిక‌క్కడ ప్ర‌జ‌ల నీరాజ‌నాల మ‌ధ్య జ‌న‌నేత పాద‌యాత్ర‌ను సాగిస్తున్నారు. వృద్ధులు - మ‌హిళ‌లు - విద్యార్థులు - యువ‌త పెద్ద ఎత్తున స్పందిస్తూ.. జ‌గ‌న్ వెంట జై కొడుతున్నారు.

ఇక‌, ఈ పాద‌యాత్ర క‌డ‌ప‌లో ప్రారంభ‌మై ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలుకు చెందిన టీడీపీ నేత‌లు జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో వైసీపీలో చేరిపోయారు.  టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సమక్షంలో శనివారం సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ నుంచి  చేరగా, వారందరినీ జగన్‌... సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరంద‌రికీ పార్టీ కండువాలు క‌ప్పి.. స‌భ్య‌త్వం అందించారు.

వైద్య విభాగం అధ్య‌క్షుడు రామిరెడ్డితో పాటుగా కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్ - మాజీ ఎంపీటీసీ కుమార్ - మద్దూరు రామసుబ్బారెడ్డి - అలాగే బనగానపల్లె మండలం కైఫా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి - నడిపెన్న - మహేష్ తో పాటు పలువురు వైఎస్‌ ఆర్‌ సీపీలో చేరారు.  ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ... రాబోయే ప్ర‌భుత్వం వైసీపీదేన‌ని, ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ పాల‌న‌తో పాటు ఇచ్చిన ప్ర‌తి హామీనీ నెర‌వేర్చేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తామ‌ని, ప్లీన‌రీలో పేర్కొన్న అన్ని విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేలా పార్టీ నేత‌లు - కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని కోరారు. అనంత‌రం పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ ప‌రిణామంతో స్థానిక టీడీపీ నేత‌లు అవాక్క‌య్యారు. బాబు పాల‌న బాగుంటే.. ఇలా జ‌రిగేదా? అని వారిలో వారు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News