ప్రముఖ సినీ నటి , భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు కుష్బూ నిత్యం ఎదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఎమ్మెల్యే , ఎంపీ , మంత్రి , ముఖ్యమంత్రి ఇలా ఏ స్థాయి వారిపైనైనా కానీ తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయం, బెరుకు లేకుండా తాను అనుకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే .. ఈ మద్యే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి , బీజేపీలో చేరిన కుష్బూ తాజాగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు.
ఈ సందర్భంగా కుష్బూ మీడియా తో మాట్లాడుతూ పలు విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. తాను తమిళనాడుకు వచ్చి 35 ఏళ్లు అయ్యిందని , కేవలం ప్రజలకి ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే ఎన్నికల బరిలో నిలిచానని చెప్పారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ప్రచారానికి మంచి స్పందన కనిపిస్తోందని, తాను తప్పకుండా గెలుస్తానని విజయం పై ధీమా వ్యక్తం చేశారు. తనకు అన్నిటికంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఏమాత్రం సహించనని, తనకు ప్రచార యావ ఎంత మాత్రం లేదని ఖుష్బూ స్పష్టం చేశారు. పత్రికల మొదటి పేజీల్లో ఫొటోలు చూసుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. అలాగే అభిమానులని ఎప్పటికీ కూడా ఓటు బ్యాంకు గా చూడకూడదు అని ,నాయకులై ముందుకు నడిపిస్తారని విశ్వాసం కలిగించినప్పుడే సినీ తారలకు జనం ఓట్లు వేస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల్లో నిబద్ధత చాలా అవసరమన్నారు. సినిమాల్లో సక్సెస్ అయ్యేవారంతా రాజకీయాల్లో కూడా అదే విధంగా రాణిస్తారని చెప్పలేమన్నారు. తానేమీ పనిగట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని, తాను కేవలం అభిప్రాయాలు మాత్రమే వెల్లడిస్తానని అన్నారు. అయితే కొంత మంది వైఖరి వివాదాస్పదంగా ఉంటుందని, అలాంటి వారిపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని అన్నారు.