వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఆయన.. వైఎస్ ప్రభుత్వంలో కీలక నేత ఆయన..వైఎస్ బతికున్నప్పుడు తెరవెనుక శక్తిగా వ్యవహరించారు కేవీపీ రామచంద్రరావు. కానీ వైఎస్ మరణం తర్వాత ఆయన ప్రాధాన్యం తగ్గింది. నమ్మిన కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. కానీ వైఎస్ కొడుకు జగన్ మాత్రం వేరుపడి వైసీపీ పెట్టి పోరాడారు. పదేళ్లకు అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తన ప్రమాణ స్వీకారానికి కేవీపీని స్వయంగా ఆహ్వానించడంతో సతీసమేతంగా వచ్చేశారు. వైఎస్ జగన్ తో బంధుత్వమే కానీ.. ఆయన రాజకీయ జీవితంలో ఇన్ వాల్వ్ కానీ కేవీపీ.. తన కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టి మేనల్లుడు జగన్ కోసం ప్రమాణ స్వీకారానికి వచ్చారు.
జగన్ పుట్టకముందే వైఎస్ కు స్నేహితుడిగా కేవీపీ ఉన్నారు. ఇద్దరు కలిసి డాక్టర్ చదువుకున్నప్పుడు వైఎస్-కేవీపీలు స్నేహితులుగా మారారు. ఇక ఆ తర్వాత వైఎస్ కు పెళ్లి కావడం.. జగన్ - షర్మిలా పుట్టడాన్ని కేవీపీ స్వయంగా చూశారు. అప్పటి నుంచే జగన్ కేవీపీని మామ అని పిలిచేవారు. మేనల్లుడు జగన్ అని కేవీపీ కూడా ముద్దుగా పిలిచేవారు. అయితే వైఎస్ కు ఆత్మగా పేరొందిన కేవీపీ.. జగన్ వెంట వైసీపీ బాటపట్టలేదు. జగన్ కు అండగా నిలవలేదు. ఇప్పుడు జగన్ సీఎం అయినవేళ మాత్రం ఆనందంతో వచ్చేశారు. జగన్ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు.
ఇక వైఎస్ జగన్ పై ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు హెలీక్యాప్టర్ తో పూలవర్షం కురిసింది. మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించిన వసంత కృష్ణ ప్రసాద్ సొంత ఖర్చుతో హెలీక్యాప్టర్ ఏర్పాటు చేసి పూలవర్షం కురిపించారు. జగన్ తోపాటు స్టేడియంలోని ప్రజలపై పూలవర్షం కురిపించారు. ఇది ఈ ప్రమాణ స్వీకారంలో హైలెట్ గా నిలిచింది.