కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - ఎంపీ కేవీపీ రామచంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ రెండుకళ్ల సిద్ధాంతం - విభజన రాజకీయాలతో ప్రజల్ని ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జాతీయ నాయకులు మద్దతు తెలిపినా చంద్రబాబుకు కళ్లు తెరుచుకోవడం లేదని కేవీపీ విమర్శించారు. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని తెలిపారు.
విభజన చట్టం హామీలను సాధించుకునే దమ్ము లేకనే తమపై విమర్శలు చేస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ-టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేకూరాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ కుట్రలను భరోసా సభ ద్వారా ఎండగడతామని కేవీపీ హెచ్చరించారు. రాహుల్ సభతో చంద్రబాబుకు వణుకుపుడుతోందని కేవీపీ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా... గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక హోదా భరోసా సభ నిర్వహించనున్నారు. సభకు ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఇతర పార్టీల నాయకులు హాజరుకానున్నారు. పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కళాశాలలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను ఎఐసీసీ కార్యదర్శి కుంతియాతో కలిసి పరిశీలించిన అనంతరం పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. గుంటూరులో రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేస్తున్న విషయం తెలియగానే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ద్వారా కేంద్రం చెప్పించిందని, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏ అధికారంతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా భరోసా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జెడియు నుంచి శరద్‌యాదవ్, డిఎంకె నుంచి ఇలంగోవన్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక ఎంపి హాజరువుతారని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/