ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్లాన్ వేస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో... అక్కడే వెతుక్కోవాలన్న చందంగా... ఏపీలో కాంగ్రెస్ బలం పెరిగేలా సీనియర్ నాయకులు స్కెచ్ లు వేస్తున్నారు. తాజాగా కేవీపీ రామచంద్రరావు కూడా కాంగ్రెస్ అధినేత్రితో కలిసి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా.. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు తదితర వాటిపై వివరించి... వారిని ‘మట్టి సత్యాగ్రహం’లో పాల్గొనాలని కోరారు.
ఈ సందర్భంగా కేవీపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి నీళ్లు, మట్టి తీసుకు వచ్చారని, ఇప్పుడు అదే మట్టిని, నీటిని కేంద్రానికి తిరిగి పంపిస్తాం. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి’ అన్నారు. అమరావతికి మోడీ.. మట్ - నీరు మాత్రమే ఇచ్చారని.. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో తమ అధినేత్రి సోనియా - రాహుల్ గాంధీలు పాల్గొంటారని కేవీపీ తెలిపారు.