టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏపీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు ఇటీవల తరచూ పోలీసులపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అయ్యన్న పాత్రుడు సైతం పోలీసులపై తరచూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల్లో ఒక్కోసారి శృతి మించుతోన్న భావన కూడా కలుగుతోంది. అయ్యన్న పోలీసులపై మరీ పరుష పదజాలం వాడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత
తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె అయ్యన్న వ్యాఖ్యలను ఖండించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే ఆయన్ను బట్టలూడదీసి కొట్టే రోజు వస్తుందని ఆమె హెచ్చరించారు. ఆయన మాట్లాడే మాటలు మూడు సింహాలే తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. తాము కరోనా సమయంలో కూడా ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించామని.. చిత్తూరు వరదల్లో కూడా కొందరిని కాపాడుతూ ఓ పోలీస్ ప్రాణాలు కోల్పోయాడని ఆమె తమ సిబ్బంది సేవలను గుర్తు చేశారు.
పోలీసులను బట్టలు ఊడదీసి కొట్టాలన్న అయ్యన్న వ్యాఖ్యలను స్వర్ణలత తీవ్రంగా ఆక్షేపించారు. మాకు బట్టలూడదీసి కొట్టడం, పరిగెత్తుకు వచ్చి కొట్టడం అనేవి ట్రైనింగ్‌లోనే నేర్పిస్తారని.. జాగ్రత్తగా మాట్లాడాని అయ్యన్నకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఏం పీకుతున్నారంటూ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నాడని.. పోలీసులు ఏం పీకుతున్నారో ? ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని స్వర్ణలత చెప్పారు.
తాము ఎన్నో ఇబ్బందులతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తుంటే.. కనీస గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తాము అయ్యన్నను చాలాసార్లు హెచ్చరించామని.. అయినా ఆయన మాత్రం నోరు అదుపులో పెట్టుకోలేదని మండిపడ్డారు. ఇక అయ్యన్నను తక్షణమే అరెస్టు చేయాలని తాము హోం మంత్రితో పాటు డీజీపీ, విశాఖ ఎస్పీకి వినతిపత్రాలు కూడా ఇచ్చామని.. అయ్యన్న పోలీసులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.