తిరుమల వెంకన్నను శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకున్న మాజీ ఎంపీ - సర్వేల కింగ్ లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం గుడి ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై విశ్లేషించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసారి స్వతంత్రులు ఎక్కువగా గెలుస్తారని స్పష్టం చేశారు. 8 నుంచి 10 మంది వరకు స్వతంత్రులు గెలవబోతున్నారని సర్వేలో తేలిందని వివరించారు.. అంతేకాదు చాలా మంది రెబల్స్ కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు..
తాము సర్వేలు చేస్తున్నామని.. ప్రతిరోజు గెలిచే ఇద్దరు అభ్యర్థులను పేర్లను వెల్లడిస్తానని లగడపాటి మీడియాకు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట లో బీఎల్ ఎఫ్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి గెలుస్తున్నారని.. అలాగే ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో స్వతంత్ర్య అభ్యర్థి అనిల్ కుమార్ గెలవబోతున్నారని లగడపాటి ప్రకటించారు. వీరిద్దరూ కూడా రెబల్స్ అని లగడపాటి పేర్కొన్నారు.
లగడపాటి సర్వేలకు విశ్వసనీయత ఉంటుంది. ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన సర్వేలు దాదాపు నూటికి 90శాతం నిజమయ్యాయి. వివిధ సర్వే ఏజెన్సీలతో కలిసి ఆయన చేసిన సర్వేలు నిక్కచ్చగా ఉండడంతో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఎవరు గెలుస్తారనే దానిపై ఆయన సర్వేలు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈరోజు తిరుమల వెంకన్నను దర్శించుకున్నాక ఆయన ఇద్దరు విజేతలను ప్రకటించారు. ఒకరు టీఆర్ ఎస్ - ఒకరు కాంగ్రెస్ గెలుస్తున్నట్టు తెలిపారు. 10 మంది వరకు స్వతంత్రులు గెలుస్తారని తెలిపారు. మరి ఓవరాల్ గా తెలంగాణపై జెండా ఎగురవేసేది ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. మరి లగడపాటి జోస్యం నిజమవుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..