బాలక్రిష్ణ పిచ్చోడు..జూనియర్ ఒక్కడే మగాడు

Update: 2018-12-24 11:03 GMT
‘ ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో బాలక్రిష్ణ మోసపోయాడని.. బాలయ్య పిచ్చోడని.. ఓ ఎమ్మెల్యే సీటు ఇచ్చి  నీ సినిమాలు చేసుకో పో అనగానే తోక ఊపుకుంటూ వచ్చేశాడని’ అని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. బాలయ్య అమాయకుడు అని అన్నారు. తెలివైన వాడు.. తాత పోలికలున్న జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకొచ్చి ఓ యువ నాయకుడి పోస్టు ఇవ్వవచ్చు కదా అని లక్ష్మీపార్వతి విమర్శించారు. లోకేష్ కు పోటీవస్తాడనే జూనియర్ ను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ - లోకేష్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. ఎక్కడా లోకేషన్ ను హైజాక్ చేస్తాడనే ఎన్టీఆర్ ను అణగదొక్కేస్తున్నాడని ధ్వజమెత్తారు.  బాలయ్యతో వియ్యం అందుకొని మొత్తం నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు హైజాక్ చేశాడని విమర్శించారు..

వాడుకోవడంలో చంద్రబాబును మించిన నేత లేడని.. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల్లో ప్రచారానికి వాడుకొని తర్వాత కూరలో కరివేపాకులా తీసిపారేశాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్ కు పోటీవస్తాడనే ఎన్టీఆర్ ను చంద్రబాబు అణగదొక్కుతున్నాడని ధ్వజమెత్తారు. లోకేష్ బాబు ఎన్నికల్లో పోటీచేయకుండా మంత్రి అయ్యాడని.. కనీసం అఆలు కూడా రాని పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవుతాడట అని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. లోకేష్ కు 10 లక్షలు ఖర్చు పెట్టి తెలుగు నేర్పించినా ఆయనకు అబ్బడం లేదని.. తెలుగు మాట్లాడడం రాని వాళ్లు మనల్ని పాలిస్తారా అని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు.

చంద్రబాబు వ్యవహారశైలిపై హరికృష్ణ చాలా బాధపడ్డారని.. మహానాడులో లోకేష్ - బాబు ఫొటోలు పెట్టడంపై హరికృష్ణ అలిగి వేధిక దిగి వెళ్లిపోయాడని లక్ష్మీపార్వతి వాపోయారు.ఎన్టీఆర్ కొడుకుల ఫొటోలు కూడా పెట్టరా అని ప్రశ్నించారు.

కూకట్ పల్లిలో సుహాసిని బలిపశువును చేశారని.. నందమూరి కుటుంబాన్ని రోడ్డున పడేశాడని లక్ష్మీపార్వతి విమర్శించారు. నందమూరి ఆస్తిని నారా వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారన్నారు. సుహాసినికి సొంత తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు చంద్రబాబు కుట్ర తెలిసే  ప్రచారానికి రాలేదని అన్నారు. నందమూరి పౌరుషాన్ని వాళ్లు చూపించారని చెప్పుకొచ్చారు.

ఆరోజూ జూనియర్ ఎన్టీఆర్ కు బాబుకు ప్రచారం చేయవద్దని చెప్పానని.. ఇప్పుడు సుహాసిని కూడా ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబుకు ఫోన్ చేస్తే ఎత్తలేదని.. అలాంటి క్యారెక్టర్ బాబుది అని లక్ష్మీపార్వతి విమర్శించారు. వాడుకొని వదిలేయడంలో హిట్లర్ - చెంగిజ్ ఖాన్ - ఔరంగజేబు కంటే కూడా బాబు మోసగాడని మండిపడ్డారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News