బాబు ఎన్టీఆర్ అల్లుడంటే సిగ్గేస్తోంది..

Update: 2018-10-29 11:42 GMT
దివంగత ఎన్టీఆర్ భార్య - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడిన ఆమె..  వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంపై టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సీఎం చంద్రబాబు.. దివంగత నేత ఎన్టీఆర్ అల్లుడు అని చెప్పడానికే సిగ్గేస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోటు రాజకీయాలేనని ధ్వజమెత్తారు. టీడీపీ సిద్ధాంతాలను గాలికి వదిలి నీచ రాజకీయాలకు బాబు తెరలేపాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దగుల్బాజీ రాజకీయాలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మను క్షోభించేలా చేశాడని మండిపడ్డారు.

అలపిరిలో నీ మీద దాడి జరిగితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిన్ను నాడు పరామర్శించాడని.. నీకు , నీ కుటుంబానికి ఆయన అండగా నిలబడితే.. ఇప్పుడు నీ మిత్రుడి కొడుకుపై ఇంత దారుణానికి సిద్ధపడతావా అని లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అడవిలో జంతువులా బతుకాలని.. సమాజంలో బతికే అర్హత కోల్పోయాడని మండిపడ్డారు.

లోకేష్ బాబూ.. కోడి కత్తితో మీ నాన్న చంద్రబాబును ఒకసారి పొడిచి చూడు.. ఆ బాదేంటో తెలుస్తుంది అని లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రతిపక్ష నేతను అంతం చేయడమే లక్ష్యంగా.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  నీ కొడుకు వయసున్న జగన్ పై 40 ఏళ్ల అనుభవంతో ఉన్న నువ్వు హత్యాయత్నం చేయిస్తావా అని మండిపడ్డారు.

చంద్రబాబు హడావుడిగా ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాడో చెప్పాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. నీ కొడుకును ప్రజలపై రుద్దడం కోసమా అని ప్రశ్నించారు. డీజీపీ ఆ పదవికి అర్హుడేనా అని మండిపడ్డారు. చంద్రబాబు బుర్ర పనిచేయడం లేదని.. ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు ఇప్పటికైనా హత్యా రాజకీయాలు మానాలని స్పష్టం చేశారు.
Tags:    

Similar News