అత్తగారు బాబుని పొగిడేశారహో...!

Update: 2015-01-20 17:29 GMT
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే... ఒంటికాలిపై అంతెత్తున లేచి పడేవారిలో నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ఒకరు! చంద్రబాబుని విమర్శించడానికి ముందుండే టాప్‌ టెన్‌ లో ఈమె కూడా ఒకరు! నిత్యం బాబుని విమర్శించే లక్ష్మీ పార్వతి సడన్‌ గా బాబుని పొగడటం మొదలు పెట్టారు! లక్ష్మీ పార్వతి ఏంటి... బాబు ని పొగడటం ఏమిటి అని అందరికీ ఆశ్చర్యం కలగడం సహజమే కానీ... తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు! ఏపీకి ఐటీని తీసుకు వచ్చింది చంద్రబాబేనని ఆమె తేల్చి చెప్పేశారు! దేశంలోకి ఐటీని దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ తీసుకు వస్తే, ఏపీకి చంద్రబాబు తెచ్చారని మనసులో మాట చెప్పేశారు ఎన్టీఆర్‌ సతీమణి!

ఇలా కాస్త పొగిడినట్లు పొగిడారో లేదో... అంతలోనే బాబుపై ఫైర్‌ అయ్యారు! తేవడం అంటే తెచ్చారు కానీ... చంద్రబాబు ఐటీని విస్తరించే విషయంలో మాత్రం విఫలమయ్యారని... ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, వాటిని నెరవేర్చడం లోనూ విఫలమయ్యారని మొదలెట్టేశారు! తాజాగా వివాదాస్పదమైన ఎన్టీఆర్‌ విగ్రహాలకు శక్తి ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యల పైన కూడా ఆమె స్పందించి... ఎన్టీఆర్‌ దేవుడేనని, అందులో ఎలాంటి సందేహం లేదని అంటూనే... ఎన్టీఆర్‌ దేవుడన్న విషయం చంద్రబాబు నిజంగా నమ్మితే... ఆయనకు  వెన్నుపోటు ఎందుకు పొడిచాడో చెప్పాలని ప్రశ్నిస్త్తున్నారు! దేవుడిని పదవి నుండి దింపేసేటందుకు చంద్రబాబు నిజంగా పశ్చాత్తాపపడితే ఆ విషయం ఒప్పుకోవాలని సలహాతో కూడిన సూచన చేశారు! ఆ విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే... అల్లుడిని ఈ అత్తగారు ప్రారంభంలో కాస్తయినా పొగడడం మాత్రం గొప్ప విషయమే అని పలువురి అభిప్రాయం!

బాబు గారు నిజంగా పశ్చాత్తాపపడి ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పడం సంగతి అటుంచితే... ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్‌ పేరును కాస్త తగ్గించి, తన పేరుతో కొత్తగా పథకాలు ప్రవేశపెట్టడం మొదలుపెట్టేశారు బాబు! అన్నగారి ప్లేస్‌ లో చంద్రన్న రావడంతో నందమూరి అభిమానులు మాత్రం కాస్త అసహనంతో ఉన్నారనే వార్తలు వినిపిస్తోన్నాయి!
Tags:    

Similar News