లైట్ అంటున్నసీనియర్ పొలిటీషియ‌న్‌

Update: 2017-05-16 15:21 GMT
ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా సాగుతున్న ఐటీ దాడులు తారాస్థాయికి చేరి తాజాగా బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆస్తుల‌పై, కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం త‌న‌యుడు కార్తీ చిదంబ‌రం ఆస్తుల‌పై వ‌రుస దాడులు క‌ల‌క‌లం రేకెత్తించాయి. వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల‌కు సంబంధించి ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లోని లాలూకు చెందిన 22 స్థావ‌రాల‌పై ఐటీ శాఖ ఇవాళ దాడులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. త‌న‌దైన శైలిలో ప్ర‌తి సంద‌ర్భంపై స్పందించే లాలూ త‌న ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేయ‌డంపై స్పందించారు.

ఐటీ దాడులు, అక్ర‌మ కేసులు...వంటి బెదిరింపుల‌తో త‌న గొంతు నొక్కే ద‌మ్ము బీజేపీకి లేద‌ని లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ స్ప‌ష్టంచేశారు. ఇలాంటి వాటికి భ‌య‌పడేంత పిరికి వాన్ని కాన‌ని లాలూ ట్వీట్ చేశారు. ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లోని 22 స్థావ‌రాల‌లో ఐటీ శాఖ దాడులు జ‌రిపిన ఏం సాధించిందో తెలియ‌జెప్పాల‌ని లాలూ డిమాండ్ చేశారు. కాగా, వెయ్యి కోట్ల విలువైన భూముల విష‌యంలో లాలూ, ఆయ‌న కుమార్తె, ఎంపీ మిసా భార‌తి, ఆయ‌న ఇద్ద‌రు కుమారులు అవినీతికి పాల్ప‌డ్డార‌ని గ‌త‌వారం బీజేపీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న స‌మ‌యంలో క్విడ్ ప్రో కోకు పాల్ప‌డిన‌ట్లు కేంద్ర మంత్రి రవిశంక‌ర్ ప్ర‌సాద్ ఆరోపించారు. కాగా, బీజేపీ డిమాండ్ చేసిన అనంత‌రం ఐటీ దాడులు జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News