ఈ మధ్యన కాస్త చిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి.. ముఖ్యంగా మీడియాలో. ఎవరినైనా ఎత్తటం మొదలెడితే ఆకాశమే లక్ష్యంగా ఎత్తే కార్యక్రమం మొదలవుతోంది. ఇక.. దించటం మొదలెట్టినా.. అదే థోరణి. సంయమనంతో వ్యవహరించే వైఖరి అస్సలు కనిపించని పరిస్థితి. ప్రధాని మోడీ విషయానికి వస్తే.. ఆయన్ను ఎత్తటమే తప్పించి.. ఆయన పాలనలో దొర్లుతున్న తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం పెద్దగా జరగటం లేదని చెప్పాలి.
మోడీని విమర్శించే విషయంలో ఇంగ్లిషు మీడియాలో కాస్త ప్రయత్నం జరుగుతున్నా.. తెలుగులో మాత్రం భజనే లక్ష్యమన్నట్లుగా సాగుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని.. మోడీ మీద చురకలు వేసే వారు కనిపిస్తున్నారు. సోషల్ మీడియా కానీ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదోనన్న భావన కలగటం ఖాయం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే ఆర్జేడీ అధినేత.. అవకాశం లభించిన ప్రతిసారీ ప్రధాని మోడీపై చెలరేగిపోతారు. ట్వీట్లతో చురకలు వేస్తుంటారు.
తాజాగా అలాంటి చురకే ఒకటి వేశారు. ఇటీవల స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. దీనిపై పలువురు ప్రముఖులు ట్విట్టర్ లో సంతాప సందేశాల్ని ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేసిన వారిలో ప్రధాని మోడీ ఒకరు. దీనిపై రియాక్ట్ అయిన లాలూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ.. సమయం కుదిరిప్పుడు గూండాల దాడుల్లో చనిపోతున్న భారతీయుల మీద కూడా సంతాపాన్ని ప్రకటించడంటూ ట్వీటేశారు.
ఇటీవల రాజస్థాన్లోని అల్వార్ లో గోవుల్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సందేహంతో ఒక వృద్ధుడ్ని దాడి చేసి చంపేశారు . చివరకు తేలిందేమంటే.. గోవుల్ని అక్రమంగా తరలించటం లేదని.. కొనుక్కొని తీసుకెళుతున్నట్లుగా తేలింది. ఈ ఘటనపై ఏవరూ స్పందించకపోవటంతో లాలూ ఈ అంశాన్ని ప్రస్తావించి.. మోడీకి తనదైన శైలిలో చురకలేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/