లక్ష రూపాయిల రుణం కావాలని బ్యాంకు వెళ్లి.. సవాలచ్చ ప్రశ్నలు వేస్తారు. కానీ.. కంపెనీలు పెట్టిన ప్రముఖులకు కోటి.. రెండు కోట్లో కాదు.. ఏకంగా వేలాది కోట్ల రూపాయిల రుణాలు ఇచ్చేస్తుంటారు. ఇలా ఎలా ఇచ్చేస్తారన్న ప్రశ్నకు ఒక్కరంటే ఒక్కరు కూడా సూటి సమాధానం చెప్పరు. అంతేనా.. మిగిలిన విషయాల మీద అదే పనిగా నోరు వేసుకొనే నేతలు సైతం మౌనంగా ఉంటారే కానీ.. పెదవి విప్పి మాట్లాడటానికి ఇష్టపడరు.
రాజకీయంగా సిల్లీ విషయాల మీద కూడా తిట్ల వర్షం కురిపించే నేతలు.. పార్టీలు.. లక్షలాది కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని రుణంగా తీసుకొని ఎగ్గొట్టే కంపెనీల మీద సీరియస్ యాక్షన్ తీసుకొమ్మని డిమాండ్ చేయరు. ఇక.. తరచూ ఆందోళనలు.. నిరసనలతో అట్టుడికిపోయేలా చేసే ఉద్యమ సంస్థలు సైతం ఇంత భారీ ప్రజాధనం పక్కదారి పట్టటంపై ఆందోళనలు.. నిరసనలు చేపట్టటం అన్నది కనిపించదు.ఇదంతా పక్కన పెడితే.. ఈ మధ్యనే దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో మొండి బకాయిల జాబితాను తయారు చేయటం అందులో కేవలం 12 మంది దగ్గరే దాదాపు రూ.2లక్షల కోట్ల ప్రజాధనం ఉందన్న విషయం బయటకు వచ్చి సంచలనంగా మారింది.
అంత భారీగా బ్యాంకుల రుణాల్ని ఎగ్గొట్టిన కంపెనీల్లో ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ ఒకటి. ఆ సంస్థ మొత్తంగా రూ.11,367 కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఫండ్ ఆధారిత బకాయిలు రూ.8146కోట్లు.. నాన్ ఫండ్ బకాయిలు రూ.3221 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదిలాఉంటే.. రుణాలు తిరిగి చెల్లించకుండా డిఫాల్ట్ అయిన కంపెనీలపై దివాలా ప్రక్రియ షురూ చేయాలని ఇటీవల ఆర్ బీఐ బ్యాంకుల్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఐబీసీ కింద ల్యాంకోపై చర్యలు షురూ చేయాలని ల్యాంకోకు అప్పు ఇచ్చిన ఐడీబీఐ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. ఇదే విషయాన్ని ల్యాంకో ఇన్ ఫ్రా ధ్రువీకరించింది కూడా. ఒకవేళ బ్యాంకు ఆదేశాల మరింత ముందుకు వెళితే.. దివాల దిశగా ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ దిశగా ఆ కంపెనీ ప్రయాణిస్తుందా? మొండి బకాయిల చెల్లింపుల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/