ఫ్యూచర్ అమరావతి ఇలా ఉంటుందట

Update: 2017-02-19 05:16 GMT
ఏపీ రాజధాని అమరావతి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే పలు రకాలుగా చెప్పుకొచ్చారు. మాటల్లో చెప్పే అమరావతికి.. పేపర్ మీద ఫైనల్ అయ్యే అవరావతికి మధ్య లెక్క తేడా ఉండటం ఖాయం. తాజాగా ఏపీ రాజధానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజధాని నగరాన్ని తొమ్మిది థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో బాబు సర్కారు ఉన్న విషయం తెలిసిందే. మరీ.. తొమ్మిది థీమ్ పార్కులేంటి? వాటిని ఎలా రూపొందించనున్నారు? ఎంత భూమిని వాటి కోసం కేటాయించనున్నారు? అన్న దానిపై ఇప్పుడు కాసింత క్లారిటీ వచ్చింది. తొమ్మిది థీమ్ పార్కులకు భూముల్ని కేటాయించారు. మరా లెక్కల్లోకి వెళితే..

తొమ్మిది థీమ్ పార్కులేంటి..?

1.        పరిపాలన

2.        న్యాయ

3.        ఆర్థిక

4.        టెక్నాలజీ

5.        ఎలక్ట్రానిక్స్

6.        ఆరోగ్య

7.        స్పోర్ట్స్

8.        మీడియా

9.         పర్యాటక

ఏ పార్కు కోసం ఎంతెంత..?

కృష్ణా నది తీరాన వెలవనున్న ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి నగరాన్ని తొమ్మిది థీమ్ సిటీలుగా అభివృద్ధి చేయాలన్నది బాబు ఆలోచన. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే.. మోడ్రన్ సిటీగా అభివృద్ధి చేయాలన్నది ఏపీ సీఎం ఆలోచన. ఇందులో భాగంగానే థీమ్ సిటీలను ఎంపిక చేయటం కనిపిస్తుంది. మొత్తం217.33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. 53,647 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న అమరావతిలో పర్యాటక రంగానికి భారీగా భూములు కేటాయించిన ఏపీ సర్కారు.. అతి తక్కువగా పరిపాలన నగరానికి భూమిని కేటాయించారు. పర్యాటక సిటీ కోసం 11,574 ఎకరాలు కేటాయిస్తే.. ఆడ్మినిస్ట్రేటివ్ సిటీకి కేవలం 2702 ఎకరాలు మాత్రమే కేటాయించటం గమనార్హం. ప్రపంచ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ఈ సిటీకి సంబంధించిన ముసాయిదా డిజైన్లను ఈనెల 22న లండన్ కు చెందిన నార్మన ఫాస్టర్ సంస్థ అందజేయనుంది. దీంతో.. రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన మరో కీలక దశ దాటుతుంది. ఈ డిజైన్లను ఖరారు చేసిన కొద్ది నెలల్లోనే.. వీటి నిర్మాణం మొదలు కానుంది. ఈప్రక్రియ మొత్తం ఈ ఏడాదిలోనే షురూ కానుంది.

ఇంతకూ..అమరావతిలో ఉండే తొమ్మిది థీమ్ సిటీలేంటి..?

1.        పర్యాటక నగరం

= ఈ థీమ్ సిటీని 11,574 ఎకరాల్లోనిర్మిస్తారు.

= ఇందులో పర్యాటక ప్రదేశాలు.. హోటళ్లు.. రిసార్ట్స్.. పర్యాటక రంగానికి చెందిన కార్యాలయాలు.. వినోద ప్రదేశాలు ఉంటాయి.

= హోటళ్లు.. రిసార్ట్స్.. ఆఫీసుల కోసం 8778 ఎకరాలు కేటాయించారు.

= గృహ అవసరాల కోసం 1397 ఎకరాలు.. వాణిజ్య అవసరాల కోసం 451 ఎకరాలు.. పరిశ్రమలకు 100 ఎకరాలు.. ప్రత్యేక జోన్ కు 156 ఎకరాలు.. భవిష్యత్ అవసరాల కోసం 692 ఎకరాల కేటాయింపు.

2.        టెక్నాలజీ సిటీ

= ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా దీన్ని నిర్మించాలన్నదే లక్ష్యం.

= దేశవిదేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థుల్ని ఆకర్షించాలన్న ఆలోచనతో టెక్నాలజీ సిటీకి8547 ఎకరాలు కేటాయించారు.

= ప్రత్యేక జోన్ కోసం976 ఎకరాలు.. విద్యా సంస్థలు.. గృహ అవసరాల కోసం3562 ఎకరాలు.. కమర్షియల్ అవసరాలకు 1257 ఎకరాలు కేటాయించారు.

= వినోదం ఇతరత్రా ప్రజాపయోగ అవసరాల కోసం 1340 ఎకరాలు.. పరిశ్రమలకు87ఎకరాలు.. భవిష్యత్ అవసరాల కోసం 1322 ఎకరాల కేటాయింపు.

3.        హెల్త్ సిటీ

= ప్రభుత్వ.. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఇక్కడే ఉంటాయి. వీటితోపాటు వాటికి అనుబంధమైన విద్యాసంస్థల కార్యాలయాలు ఇక్కడేఏర్పాటు చేస్తారు.

=హెల్త్ సిటీ కోసం 6511 ఎకరాల్ని కేటాయించారు.

= వీటిల్లో ప్రత్యేక జోన్ కోసం 1048ఎకరాలు.. గృహావసరాల కోసం3306 ఎకరాలు.. వినోదం.. ఇతరాల కోసం 580 ఎకరాలు.. కమర్షియల్ అవసరాలకోసం 504 ఎకరాలు.. ఫ్యూచర్ అవసరాల కోసం 1072 ఎకరాల్ని కేటాయించారు.

4.        స్పోర్ట్స్ సిటీ

= జాతీయ అంతర్జాతీయ క్రీడాపోటీలకు వేదిక కావటమే ఈ సిటీ లక్ష్యం.

= ఈ సిటీ కోసం 4150 ఎకరాల కేటాయింపు

= ప్రత్యేక జోన్లకు 436 ఎకరాలు.. గృహ అవసరాల కోసం1819 ఎకరాలు..సామాజిక ప్రయోజనాల కోసం బహిరంగ ప్రదేశాలుగా ఉంచేందుకు 555 ఎకరాలు..కమర్షియల్ అవసరాల కోసం513 ఎకరాలు.. పరిశ్రమలకు134 ఎకరాలు.. ఫ్యూచర్ అవసరాల కోసం 693 ఎకరాలు.

5.        ఫైనాన్షియల్ సిటీ

= ఆర్థిక వ్యవహారాలతో పాటు.. ప్రభుత్వ.. ప్రైవేటు రంగానికి చెందిన సంస్థలు.. కార్యాలయాలు ఇందులోఏర్పాటు చేస్తారు.

= ఫైనాన్షియల్ సిటీ కోసం 5618ఎకరాల్ని కేటాయించారు.

= ప్రత్యేక జోన్ల కోసం844.. గృహ అవసరాల కోసం 1389.. వినోదం.. సామాజిక ప్రయోజనాల కోసం 1250.. వాణిజ్య అవసరాల కోసం 828.. పారిశ్రామిక రంగానికి 101.. భవిష్యత్ అవసరాల కోసం 756 ఎకరాల కేటాయింపు.

6.        మీడియా సిటీ

= ప్రింట్.. ఎలక్ట్రానిక్.. వెబ్ మీడియాకు చెందిన పలు సంస్థల కార్యాలయాలు.. వాటి ఉద్యోగుల గృహాలు ఈ సిటీలో ఏర్పాటు చేస్తారు.

= మొత్తం 5107 ఎకరాల్లో ఈ సిటీని నిర్మిస్తారు.

= ఈ నగరంలో ప్రత్యేక జోన్లకు 346 ఎకరాలు.. గృహావసరాల కోసం 1862 ఎకరాలు.. వినోదం.. ఇతర సామాజిక అవసరాల కోసం 1291 ఎకరాలు.. కమర్షియల్ అవసరాలకు791 ఎకరాలు.. పారిశ్రామిక అవసరాల కోసం 250ఎకరాలు.. ఫ్యూచర్ అవసరాల కోసం 567 ఎకరాలు కేటాయించారు.

7.        న్యాయ నగరం (జస్టిస్ సిటీ)

= ఈ నగరంలో హైకోర్టు.. ఇతర న్యాయస్థానాలు.. న్యాయ వ్యవస్థకు చెందిన పరిపాలనా కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తారు.

= హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదలు ఆ శాఖకు చెందిన అధికారులు.. ఉద్యోగులు.. ఆ శాఖకుచెందిన వారి కోసం ఇళ్లను ఇక్కడే నిర్మిస్తారు.

= 3438 ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మిస్తారు.

=  న్యాయ నగరంలో ప్రత్యేక జోన్ కోసం 458ఎకరాలు.. గృహావసరాల కోసం1276 ఎకరాలు.. వినోదం.. ఇతర సామాజిక అవసరాల కోసం 692 ఎకరాలు.. వాణిజ్య అవసరాల కోసం467ఎకరాలు.. భవిష్యత్ అవసరాల కోసం 545 ఎకరాల్ని కేటాయించనున్నారు.

8.        పరిపాలన నగరం (ఆడ్మినిస్ట్రేటివ్ సిటీ)

= అసెంబ్లీ.. శాసన మండలి.. సెక్రటేరియట్.. విభాగాధిపతుల ఆఫీసులు.. గవర్నర్.. ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఇతర ఉన్నతాధికారుల నివాసాలు ఇక్కడే ఉండనున్నాయి.

= ఈసిటీ కోసం2702ఎకరాల్నికేటాయించారు. ఇందులో ప్రత్యేక జోన్లకు 638 ఎకరాలు.. గృహావసరాల కోసం833 ఎకరాలు.. వినోదంఇతరసామాజిక అవసరాల కోసం.. బహిరంగస్థలాల కోసం 427ఎకరాల్ని కేటాయించారు.

9.        ఎలక్ట్రానిక్స్ సిటీ

= ఈ సిటీని మొత్తంగా 6582 ఎకరాల్లో నిర్మించనున్నారు.

= ప్రత్యేక జోన్ కోసం 645 ఎకరాలు.. పారిశ్రామిక రంగానికి 1618 ఎకరాలు.. గృహావసరాలకు1862 ఎకరాలు.. వాణిజ్య అవసరాల కోసం682 ఎకరాలు.. వినోదం ఇతర ప్రయోజనాల కోసం 757ఎకరాలు.. ఫ్యూచర్ అవసరాల కోసం 503 ఎకరాల్ని కేటాయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News