అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ( నాసా) ఎంతగా ప్రయత్నిస్తున్నదో అందరికీ తెలిసిన విషయమే. అంగారక గ్రహం మీద ఉన్న అణువణువును పరిశీలించాలని నాసా తహతహలాడుతున్నది. కాగా,అంగారక గ్రహం గురించి తాజాగా మరో అప్డేట్ వెలుగులోకి వచ్చింది.మార్స్(అంగారకుడు) పై ఓ అతిపెద్ద ఎడారి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి.
ఇప్పటికే అంగారకుడిపై పలు దేశాలు తీవ్రంగా పరిశోధనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నాసా అంగారక గ్రహం ఉత్తర ధ్రువానికి సంబంధించిన కొన్ని ఫొటోలు విడుదల చేసింది. ఈ ఫొటోలను ఒడిస్సీ ఆర్బిటర్ చిత్రీకరించినట్టు నాసా పేర్కొన్నది. ఒక్కో ఫొటోలో దాదాపు 19 మైళ్ల విస్తీర్ణంతో కూడిన మార్స్ నార్త్ పోల్ ఫొటోలను తీసినట్లు నాసా సైంటిస్టులు పేర్కొన్నారు.
అయితే ఈ ఫొటోలను చూస్తుంటే నాసాలోని ఉత్తర ధ్రువం మొత్తం ఎడారి ప్రాంతంలా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే భూమితో పోల్చి చూసినప్పుడు అంగారక గ్రహం విస్తీర్ణంలో చాలా పెద్దది. ప్రస్తుతం విడుదలైన ఒక్కో ఫొటో అమెరికాలోని టెక్సాస్ సిటీ అంత పరిమాణంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే అంగారకుడి ఉత్తర ధ్రువంలో ఇసుక దిబ్బలు ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంగారకుడి మీద ఉన్న ఫొటోలను చూసి శాస్త్రవేత్తలే కాక సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంగు రంగుల చిత్రపటాలు అందరి మనసులను దోచేస్తున్నాయి. నిజంగా అంగారకుడి మీద ఎలా ఉంటుందో తెలియదు కానీ .. ఆ ఫొటోలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి.
ఒక్కోచోట నీలంరంగులో .. మరికొన్ని చోట్ల బంగారు వర్ణంలో ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు థ్రిల్ అవుతున్నారు. అయితే బ్లూ కలర్ లో ఇసుకదిబ్బలు ఉన్న ప్రాంతం ఎంతో శీతల ప్రదేశం అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అక్కడ -150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని అంటున్నారు.
ఇంతకీ ఈ ఫొటోలు ఎలా తీశారంటే..!
అత్యాధునిక పరిజ్ఞానం ద్వారా అంగారకుడిపై నుంచి చిత్రాలను తీశారు శాస్త్రవేత్తలు. ఒడిస్సీ ఆర్బిటర్ లో అమర్చిన థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్ (థెమిస్) వ్యవస్థ ఆ ఫొటోలను తీసినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2001 అక్టోబర్ 24వ తేదీన నాసా ఈ ఒడిస్సీ ఆర్బిటర్ ను ప్రయోగించింది. 20 సంవత్సరాలుగా ఇది అక్కడే ఉంది. ఈ ఫొటోల ఆధారంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.