అమెరికాపై ప్రకృతి పగబట్టింది. టెక్సాస్ పై విరుచుకుపడిన హార్వీ హరికేన్ కనీవినీ ఎరుగని నష్టాన్ని కలిగిస్తే.. లాస్ ఏంజిల్స్‌ను కార్చిచ్చు వణికించింది. ఇప్పటి వరకు జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఇదే అతి పెద్దదిగా రికార్డు సృష్టించింది. ఇటీవల అమెరికాలో ఏ విలయం సంభవించినా దాని ఫలితం మాత్రం అంచనాలకు అందని నష్టాన్నే మిగులుస్తోంది.
తాజాగా.. లా ట్యూనా కెనియన్ లో చెలరేగిన కార్చిచ్చు శనివారం రాత్రి ఉత్తర లాస్ ఏంజిల్స్ నగరాన్ని నిద్రలేకుండా చేసింది. గత రెండు రోజులుగా ఐదు వేల ఎకరాల అటవీ ప్రాంతం కార్చిచ్చుకి భస్మీపటలమై బూడిద కుప్పగా మారింది. మంటల్లో వేలాది ఎకరాలు కాలి బూడిదైనట్లు లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కార్చిచ్చుకు 'లా ట్యూనా ఫైర్' అని నామకరణం చేసినట్లు వెల్లడించింది.
కార్చిచ్చు కారణంగా వెలువడిన మంటలతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత మూడు అంకెలను దాటింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బర్బాంక్‌లో 300 - గ్లెండాల్ లో 250 - లాస్ ఏంజిల్స్ లో 180 ఇళ్లను ఖాళీ చేయించారు. లాస్ ఏంజిల్స్ నగర చరిత్రలో అత్యంత పెద్ద ప్రమాదం ఇదేనని తెలిపింది. గాలి ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారి తెలిపారు.