కేసీఆరా? పువ్వాడా? ఎవ‌రు నిజం.. ఏది వాస్త‌వం?

Update: 2022-07-26 23:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆ రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌లు చేసిన వ్యాఖ్య లు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్ద‌రూ తెలంగాణ‌లోని ఉమ్మ‌డి ఖ‌మ్మం, మ‌హ‌బూ బ్‌న‌గ‌ర్ వంటి జిల్లాల్లో తాజాగా సంభవించిన వ‌ర‌ద‌ల‌పై ప‌ర‌స్ప‌రం విరుద్ధ‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. గోదావ రి ఉప్పొంగ‌డంతో.. పెచ్చ‌రిల్లిన వ‌ర‌ద‌లు.. రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేశాయి. చాలా జిల్లాలు నీట మునిగాయి. దీంతో స‌ర్కారుపై స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేశాయి.

దీంతో కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ``క్లౌడ్ బ‌రస్ట్` జ‌రిగింద‌ని.. ఇది విదేశీ కుట్ర అని అన్నారు. దీని పై విస్తృత స్థాయిలో చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. మేధావులు అయితే.. కొట్టిపారేసినా.. రాజ‌కీయ దుమారం మాత్రం కొన‌సాగుతూనే ఉంది.

నిజంగానే విదేశాలు కుట్ర ప‌న్నితే.. అది ఒక్క తెలంగాణ‌కే ఎందుకు వ‌చ్చిం దనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇత‌ర రాష్ట్రాల్లోనూ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్, బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాలు.. స‌గానికి పైగా మునిగిపోయాయి.

స‌రే.. ఈ విష‌యం అలా ఉంచితే.. మంత్రి పువ్వాడ‌.. ఇదే వ‌ర‌ద‌ల‌పై.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌భు త్వం పోల‌వ‌రం ఎత్తు పెంచుతోంద‌ని.. అందుకే నీరు వెన‌క్కి వ‌చ్చి.. భ‌ద్రాచ‌లం మునిగిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని.. చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే పోల‌వ‌రం విలీన మండ‌లాల వివాదం తెర‌మీదికి వ‌చ్చి.. ఏపీ మంత్రుల‌కు.. పువ్వాడ‌కు మ‌ధ్య విమ‌ర్శ‌ల సినిమా క‌నిపించింది. క‌ట్ చేస్తే.. అస‌లు వ‌ర‌ద‌ల‌కు రీజ‌నేంటి? అనేదిఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సాక్షాత్తూ.. సీఎం కేసీఆర్ చెప్పింది నిజ‌మైతే..క్లౌడ్ బ‌ర‌స్ట్ అనే మాట‌నే పువ్వాడ చెప్పాలి. ఇత‌ర మంత్రు లు కూడా చెప్పాలి. దానిపై కేంద్రాన్ని నిల‌దీయాలి. విదేశీ కుట్ర‌ను అడ్డుకోలేనిమోడీ స‌ర్కారును గ‌ద్దె దిగ‌మ‌ని అడ‌గాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఇక‌, పువ్వాడ చెప్పిందే నిజ‌మైతే.. గ‌త ఏడాది కూడా భ‌ద్రాచ లం మునిగిపోయింది.

మ‌రి దీనికి కార‌ణం ఏంటో ఆయ‌నే చెప్పాలి. ఇక‌, సీఎం ఒక మాట‌.. మంత్రి పువ్వా డ మ‌రో మాట మాట్లాడ‌డం ఏంటో.. అర్ధం కాని విష‌యం. ఏదేమైనా.. వ‌ర‌ద‌లపై విప‌క్షాల‌ దాడి  నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకునే ఎత్తుగ‌డ‌గానే రాజ‌కీయ పార్టీల నేత‌లు భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News