ఏపీలో వచ్చే ఎన్నికలు ఆషామాషీగా తీసివేయడానికి అసలు వీలు లేదు. ఎందుకంటే ఏ పార్టీ వెనకబడినా ఇక చరిత్రలోనే చూసుకోవాలి అన్నంతగా ఈ ఎన్నికల ఫలితాలు ఉంటాయని అంటున్నారు. టీడీపీకి చావో రేవో అంటున్నారు. అలాగే వైసీపీకి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. దాంతో గతంలో మాదిరిగా కాకుండా ఆచీ తూచీ అడుగులు వేయాల్సిన అవసరాన్ని వైసీపీ పెద్దలు గుర్తిస్తున్నారు అని అంటున్నారు.
ఇక పొత్తుల విషయంలో అయితే టీడీపీ ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఆరు నూరు అయినా ఒంటరిగా టీడీపీ వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. అన్ని పార్టీలను కలుపుకుని మహా కూటమిగా రావాలన్నదే టీడీపీ ప్లాన్. అది నెరవేరకపోతే జనసేనతో పాటు కలసివచ్చే వారితోనే ఎన్నికలను ఎదుర్కోవాలని టీడీపీ చూస్తోంది.
ఈ సందర్భంగా చూస్తే పొత్తుల మీద వైసీపీ ఆలోచనలు ఏమైనా మారుతున్నాయా అన్నదే ఇపుడు చర్చ. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం మీద సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ పొత్తుల గురించి ఇపుడు చర్చించడం దండుగ అనేశారు. ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండగా పొత్తుల గురించి ఎవరైనా ఆలోచిస్తారని అన్నారు.
ఉత్తర దక్షిణాలు కలవవచ్చు, తూర్పు పడమరలు కూడా కలసిపోవచ్చు. పొత్తుల విషయంలో ఏదైన జరగవచ్చు అని కూడా బొత్స ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తమ పార్టీ మాత్రం 2024 ఎన్నికల్లో సింగిల్ గానే వస్తుందని బొత్స మరో మారు చెప్పారు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు ఉన్నా ఉండవచ్చు అంటూ ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు.
అయితే ఇది అంతా తమ అధినాయకుడి ఆలోచనలను బట్టి ఉంటుందని ఆయన చెప్పడం విశేషం. మరి వైసీపీ పొత్తుల గురించి ఆలోచిస్తుందా అన్న డౌట్ ని మాత్రం బొత్స మాటల ద్వారా వ్యక్తం చేశారు. నిజానికి వైసీపీ పెట్టిన నాటి నుంచి సింగిల్ గానే ఎన్నికల్లో పోరాడింది. కీలకమైన ఏ ఎన్నిక అయినా మేము ఒంటరిగానే వస్తామని ధీమా ప్రదర్శించింది.
అలాంటి వైసీపీ 2024 ఎన్నికల వేళకు పొత్తులతో వస్తుందా అన్నదే ఇపుడు చర్చ. బొత్స దీని మీద కావాలని అన్నారా లేక చెప్పాలని చెప్పారా అన్నది తెలియదు కానీ వైసీపీలో పొత్తుల విషయం చర్చకు వస్తోందన్న మాట మాత్రం దీని ద్వారా తెలుస్తోంది. నిజానికి పొత్తులకు కనుక వైసీపీ సిద్ధపడితే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది.
బీజేపీతో కేంద్ర స్థాయిలో వైసీపీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగని ఆ పార్టీతో పొత్తులకు వైసీపీ సిద్ధపడుతుందా అంటే కాదనే చెప్పాలి. బీజేపీతో పొత్తు అంటే మైనారిటీ వర్గాల ఓట్లను వైసీపీ కోల్పోవాల్సివస్తఒంది. అలాగే ఆ పార్టీకి ట్రెడిషనల్ గా ఇతర సామాజిక వర్గ ఓట్లకు దెబ్బ పడుతుంది అని అంటున్నారు.
అయితే ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇచ్చేసి విభజన హమీలను నెరవేరిస్తే మాత్రం వైసీపీ బీజేపీల మధ్య పొత్తులు ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక బీజేపీ కాకపోతే సీపీఎం తో వైసీపీ ఎన్నికల పొత్తులకు వెళ్లవచ్చు అని కూడా అంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడితే వైసీపీ కామ్రెండ్స్ తో కలసి ఎన్నికలకు వెళ్ళేందుకు చూస్తుంది అని అంటున్నారు. ఆ విధంగా టీడీపీ కూటమిని అడ్డుకుంటుందని చెబుతున్నారు. అయితే సీపీఐ కన్నా సీపీఎంతో వైసీపీకి కాస్తా మంచి రిలేషన్స్ ఉన్నాయి.
ఏది ఏమైనా కూడా వైసీపీ ఒంటరి పోరుకు వెళ్లకుండా పొత్తుల వైపు చూస్తే మాత్రం అదే ఆ పార్టీ బలహీనతగా విపక్షాలు ప్రచారం చేసే ప్రమాదమూ లేకపోలేదు. అయినా ఎన్నికల రాజకీయంలో ఎత్తులు, పొత్తులు అన్నవి చాలా సహజమైనవి కాబట్టి వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి అన్నది ముందు ముందు తెలుస్తుంది అంటున్నారు.