ఔను! ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. తెల్లారింది మొదలు.. తెలంగాణ లో అధికారంలోకి వచ్చేస్తామని.. కేసీఆర్‌ను గద్దె దింపేస్తామని.. బీజేపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. ఇక, బీజేపీ రాష్ట్ర సారథి.. బండి సంజయ్ ఏకంగా.. పాదయాత్రలు..చేస్తున్నారు. ఇక, ఎప్పుడు అవకాశం దొరికతే అప్పుడు కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. సవాళ్లు రువ్వుతున్నారు. ఇదంతా కూడా ఎన్నికల్లో విజయం కోసమే. అయితే.. ఈవిషయంలో కమల నాధులు అనుసరిస్తున్న వ్యూహానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఏమైనా పొంత ఉందా? అనేది ప్రధాన ప్రశ్న.
ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో బలం లేకుండా.. ఏపార్టీ కూడా విజయం దక్కించుకునే పరిస్థితి లేదు. అందు కే.. ఏ పార్టీ అయినా.. క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలి. మరి ఈ రకంగా చూసుకున్నప్పుడు.. తెలంగాణలో బీజేపీకి కనీసం.. బూత్ స్థాయిలో కమిటీలు వేసుకోలేకపోతోందనే వాదన, విమర్శ కూడా వినిపిస్తున్నాయి. నిజానికి బూత్ స్థాయి కమిటీలు అంటే.. ఏ పార్టీకైనా ప్రధానం. విజయం దక్కించుకో వడంలో కమిటీలు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. కానీ.,.. ఈ రకంగా చూసినప్పుడు.. తెలంగాణ బీజేపీ ఎక్కడో విఫలం అవుతోంది.
వాస్తవానికి బీజేపీ ఫిలాసఫీని గమనిస్తే.. పోలింగ్ బూత్ గెలిస్తే.. ఆ సెగ్మెంట్‌లో విజయం దక్కించుకున్నట్టే నని.. నాయకులు భావిస్తారు. పార్టీ కార్యక్రమాలను కూడా బూత్ కేంద్రంగానే చేపడతారు. మరి తెలంగా ణలో ఇలాంటి పరిస్థితి ఉందా? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఏ రాష్ట్రంలో అయినా.. బీజేపీ అధికారంలో ఉందా? లేదా.? అనే విషయాలను పక్కన పెడితే.. పార్టీని పటిష్టం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బూత్ కమిటీలకు ప్రాధాన్యం ఇస్తారు.
ప్రతి పోలింగ్ బూత్‌లో 23 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని కమల నాథులు పనిచేస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాలను ఏ, బీ,సీడీ లుగా వర్గీకరిస్తారు. వీటిని బట్టి.. పార్టీ కార్యక్రమాలను సిద్ధం చేస్తారు. ఈక్రమంలో తెలంగాణలోనూ వేసిన కమిటీలు ఇచ్చిన లెక్కలు చూశాక.. పార్టీ నాయకులకు దిమ్మతిరిగిం దట. ఎందుకంటే.. బూత్ కమిటీల ఏర్పాటులోనే అనేక లోపాలు ఉన్నాయని.. సీనియర్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. రాష్ట్రంలో సుమారు 34 వేలకు పైగా పోలింగ్ బూతులు ఉన్నాయి.
వీటిలో 30 వేలకు పైగా బూతుల్లో కమిటీలు వేయాలని బీజేపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకత్వంపై రాష్ట్ర నేతలు తీవ్ర ఒత్తిడే చేశారు. ఈ క్రమంలో చేసిన కమిటీల ఏర్పాటు.. ఇప్పుడు తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఎందుకంటే.. ఎవరో ఒకరి పేర్లతో కమిటీలు వేసేసి రాష్ట్ర నాయకత్వానికి జాబితా పంపించారు. అయితే.. వీరిలో ఉన్న పేర్లు చూశాక.. రాష్ట్ర నాయకత్వానికి.. అనేక సందేహాలు వచ్చాయి. ఇంతగా పార్టీ బలోపేతం అయిందా? అని నాయకులు తలలు పట్టుకున్నారట.
అంతేకాదు.. అసలు కమిటీ ఏర్పాటుపై ఆరాతీస్తే.. ఇవన్నీ కాకిలెక్కలేనని తేలిందట. అంతా బోగస్ కమి టీలను ఏర్పాటు చేశారట. అంతేకాదు.. బూత్‌కమిటీల నేతలకు పోన్లు చేయగా.. వారు తమకు కమిటీలకు సంబంధం లేదని స్పష్టం చేశారట. దీంతో బీజేపీ నాయకులు అవాక్కయ్యారట. దీంతో పార్టీ పరిస్థితి.. మేడిపండు చందంగా ఉందని .. నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీచీఫ్ బండి సంజయ్.. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా.. పార్టీ పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంటరీ కమిటీసమావేశం నిర్వహించినప్పుడు.. ఈ కమిటీల పరిస్థితి అర్ధమైందని అంటున్నారు.
అంటే.. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను కూడా సరైన విధంగా ఏర్పాటు చేయలేకపోయిన..పార్టీ అధికారంపై మాత్రం ఆశలు పెట్టుకోవడం.. ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం. ఇక, ఈ విషయం పార్టీ హైకమాండ్‌కు తెలిసిన తర్వాత.. రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఫైరైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేస్తారో.. చూడాలి.