ఎండకన్ను సోకని దేహాలు మావి అని అంతర్మథనం చెందుతున్నారు ఎమ్మెల్యేలు.కానీ మీరు కష్టపడకపోతే నేను చేసేదేం లేదు అని అంటున్నారు జగన్.పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్నా, మీరు కోరుకున్న వారికి మంత్రి పదవులు దక్కాలన్నా మీకు మంత్రి పదవులు దక్కాలన్నా ఈ పాటి కష్టం ఆ పాటి త్యాగం తప్పవు అని పదే పదే చెబుతూ వస్తున్నారు జగన్.
కానీ వీటిని ఎమ్మెల్యేలు పట్టించుకుంటారా అన్నది ఓ పెద్ద సందేహం.ఇదే సందేహం క్షేత్ర స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా వినిపిస్తున్నారు.ఇప్పటికే స్పందన (ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ) కార్యక్రమం నిర్వహణ అన్నది జిల్లాలలో అస్సలు బాలేదని,అస్సలు అధికారులు ఎవ్వరూ మాట వినడం లేదని ఫిర్యాదులు వస్తున్న వేళ ఎమ్మెల్యేలు మాత్రం క్షేత్ర స్థాయికి పోయి గ్రౌండ్ లెవల్ రియాల్టీ తెలుసుకుని ఏం చేస్తారని ? అన్న ప్రశ్న కూడా ఒకటి రాజకీయ పరిశీలకుల నుంచి వస్తుంది.
ముఖ్యంగా రోడ్ల నిర్మాణంపై అస్సలు వైసీపీ దృష్టి సారించలేదని, కనుక కనీసం మరమ్మతులు అయినా చేపట్టి ఆపై వీళ్లంతా డోర్ టు డోర్ తిరిగి ప్రజల గోడు వినేందుకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇవేవీ కాకుండా మౌలిక వసతుల కల్పనకు దృష్టి సారించకుండా కేవలం ఫొటోల కోసమే అన్న విధంగా గడపగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించినా ఫలితం ఉండదని సాక్షాత్తూ వైసీపీ నాయకులే అంటున్నారు.
ఈ దశలో ఏప్రిల్ రెండు అంటే ఉగాది రోజు నుంచి గడపగడపకు వైఎస్సార్ ప్రొగ్రాంను నిర్వహించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిన్నటి వేళ ఆదేశించారు.అసెంబ్లీ కమిటీ హాలులో నిన్నటి వేళ నిర్వహించిన శాసన సభ పక్షం సమావేశంలో స్పష్టమయిన సూచనలు చేశారు.దిశా నిర్దేశం కూడా చేశారు.
వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేయాలంటే క్షేత్ర స్థాయిలో రానున్న రెండేళ్లూ కష్టపడాల్సిందేనని తేల్చేశారు.మరి! ఏప్రిల్ రెండు అంటే మంచి ఎండలు మండే కాలం.. మామూలుగానే మన ఎమ్మెల్యేలు అస్సలు క్షేత్ర స్థాయి పర్యటనలకు రావడం లేదే అలాంటిది ఎండలు తట్టుకుని ఎలా బయటకు వస్తారని ? ఎలా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని? ఇవే సందేహాలు ఇప్పుడు జగన్ కోటరీ నుంచి కూడా వస్తున్నాయి.