నాయకత్వం మార్పు విషయంలో జీ 23 నేతలు 24 గంటల్లోనే మాట మార్చేశారు. రెండు రోజుల క్రితం జీ 23 నేతల్లో కీలక నేతయిన కపిల్ సిబల్ మాట్లాడుతూ నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీ ఫ్యామిలి వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగా కాకుండా అందరి పార్టీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నట్లు సిబల్ అన్న విషయం తెలిసిందే. అంతకుముందే సోనియా అధ్యక్ష బాధ్యతలనుండి తప్పుకుంటానంటే సీడబ్య్లూసీ నే వద్దని చెప్పింది.
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే సిబల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే సిబల్ వ్యాఖ్యలు జీ 23 నేతలపై పార్టీలో చాలామంది మండిపోయారు. ఒక్కొళ్ళళకి నేతలు చాకిరేవు పెట్టారు. దాంతో శుక్రవారం జీ 23 నేతలు అత్యవసరంగా సమావేశమై పరిస్ధితిని చర్చించారు.
అనంతరం జీ 23కి నాయకత్వం వహిస్తున్న గులాంనబీ ఆజాద్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశమ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతు సోనియాను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకోమని తామెవరం కోరలేదన్నారు.
ఆజాద్ చెప్పిన తాజా మాటలు విన్న తర్వాత జీ 23లో సిబల్ ఒంటరివాడైపోయారు. అలాగే గాంధీ ఫ్యామిలీ లేకపోతే పార్టీకి బతుకులేదన్న విషయం జీ 23 నేతలకు కూడా బాగా అర్ధమయ్యుంటుంది. నిజానికి జీ 23 నేతలుగా చలామణి అవుతున్న నేతల్లో చాలామందికి ప్రజా బలమే లేదు. ఎప్పుడూ రాజ్యసభ ఎంపీలవుతు కేంద్రమంత్రి వర్గాల్లో చక్రం తిప్పిన వాళ్ళే. తమ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం గాంధీ ఫ్యామిలీ దయ మీద ఆధారపడిన వాళ్ళే ఇపుడు పార్టీ సంక్షోభంలో పడేటప్పటికి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఆజాద్ మాట్లాడుతూ సోనియాను బాధ్యతలనుండి తప్పుకోమని తామెప్పుడు కోరలేదని సంస్థాగత ఎన్నికలు జరపమని మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు. పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేయాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ఆజాద్ వినిపించిన డిమాండులో తప్పేలేదు.
ఎందుకంటే ఎవరైనా పార్టీ బలంగానే ఉండాలని కోరుకుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే పై స్ధాయిలో నాయకత్వం బలంగా ఉంటుందనటంలో సందేహం లేదు.