మ‌ళ్లీ బాల‌య్య హిట్టు కొడ్తాడు ? ఇది ఫిక్స్ భ‌య్యా !

Update: 2022-03-31 00:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్పటి నుంచి సిద్ధం అవుతోంది టీడీపీ. పాల‌న‌కు సంబంధించి మిగిలి ఉన్న రెండేళ్ల కాలంలో ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో అన్న ఆలోచ‌న‌ల్లో ఉంది వైసీపీ. వైసీపీ క‌న్నా టీడీపీకే ఎక్కువ అంత‌ర్మ‌థ‌నం అవ‌స‌రం. ఎందుకంటే గ‌తం క‌న్నా భిన్నంగా ఇవాళ టీడీపీ ఉంది. అధినేత మాట వినేందుకు సిద్ధంగా దిగువ స్థాయి కార్య‌క‌ర్త‌లు లేరు.

క‌నీసం వ‌లంటీరు ఉద్యోగం అయినా ఇచ్చి నెల‌కు ఐదు వేలు రూపాయ‌ల జీతం ఇచ్చి కాస్తో కూస్తో కార్య‌క‌ర్త‌ల‌ను వాటి కుటుంబాల‌ను ఆదుకున్న ఘ‌ట‌నలో ఘ‌న‌త అంతా జ‌గ‌న్ దే! అంతేకాదు స‌చివాల పోస్టుల భ‌ర్తీలో కూడా స్థానిక నాయకుల మాట చెల్లింది. అయినా కూడా టీడీపీ కి మ‌రీ అంత రోజుల్లేవు అని చెప్ప‌లేం. స్థిర నాయ‌క‌త్వం ఉన్న చోట మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

శ్రీ‌కాకుళం మొదలుకుని అనంత‌పురం వర‌కూ టీడీపీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అదేవిధంగా సంప్ర‌దాయ ఓట‌ర్లు ఎక్క‌డికీ జారుకోరు. చంద్ర‌బాబు అంటే  ఇప్ప‌టికీ అభిమానించే యువ‌త‌రం ఉంది. ఇవ‌న్నీ టీడీపీకి ప్ల‌స్ పాయింట్లే! ఈ ద‌శ‌లో రాష్ట్రంలో చెప్పుకోద‌గ్గ స్థానాల‌లో మ‌ళ్లీ త‌న హ‌వా కొన‌సాగించ‌డం ఖాయం.

అందుకే అధినేత ఓ న‌ల‌భై కొత్త ముఖాల‌ను తీసుకు రావాల‌ని వారంతా యువ‌తే కావాల‌ని అంటున్నారు చంద్ర‌బాబు నిన్న‌టి పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన ! అందుకే జ‌గ‌న్ క‌న్నా వేగంగానే కొన్ని వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించి విప‌క్ష పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇస్తున్నారు.

ఎలా చూసుకున్నా టీడీపీ,జ‌న‌సేన పొత్తు కుదిరితే జ‌గ‌న్ కు ఓ యాభై నుంచి అర‌వై సీట్లు పోవ‌డం ఖాయం. ఇదే ద‌శ‌లో బాల‌య్య లాంటి లీడ‌ర్లు మ‌ళ్లీ మ‌ళ్లీ గెలుస్తారు.

అనంత రాజ‌కీయాలలో త‌న‌కు క‌లిసి వ‌చ్చిన హిందూపురం రాజ‌కీయంలో ఎంపీ స్థానం టీడీపీ గెలుస్తుందో లేదో ఇప్ప‌టికిప్పుడు తేల్చ‌లేం కానీ బాల‌య్య మాత్రం గెలవ‌డం ఖాయం. ఇక నంద‌మూరి కుటుంబం నుంచి మ‌హిళ‌లు ఎవ్వ‌రైనా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం ఉన్న‌వారు లేక‌పోయినా క‌ల్యాణ్ రామ్ మాత్రం అరంగేట్రం చేయాల‌నే అనుకుంటున్నారు.
Tags:    

Similar News