జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై ఇపుడిదే పద్దతిలో చర్చలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళల్లో కుటుంబసభ్యులు దూరమయ్యారు. తర్వాత బంధువుని కూడా మంత్రివర్గానికి దూరంచేసేశారు. తర్వాత మిగిలింది రెడ్లు మాత్రమే కాబట్టి వాళ్ళని కూడా దూరంగా పెట్టేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో అసలు జగన్ వ్యూహం ఏమిటో అంతుచిక్కటంలేదు.
అసలు విషయం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు, ఎన్నికల సమయంలోను జగన్ కు అండగా ఏ స్ధాయిలో తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల అండగా నిలిచారో అందరికీ తెలిసేందే. అలాంటిది జగన్ అధికారంలోకి రాగానే ముందు షర్మిలను తర్వాత తల్లిని దూరంగా పెట్టేశారు. దాంతో వాళ్ళిద్దరు ఇపుడు ఏపీ నుండే వెళిపోయి తెలంగాణాలో ఉంటున్నారు. షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టుకుని అక్కడే తిరుగుతున్నారు. తల్లి కూడా కూతురుకే మద్దతుగా నిలబడ్డారు.
అంటే తల్లి, చెల్లెల్ని జగన్ దూరం పెట్టేసినట్లే అర్ధమవుతోంది. ఇక మొదటినుండి జగన్ వెంటే ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గంలో నుండి తప్పించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన బాలినేని అప్పటి రాజకీయ పరిణామాల్లో జగన్ కోసమే మంత్రిపదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. జగన్ జైల్లో ఉన్నపుడు సొంతడబ్బులు ఖర్చులు పెట్టుకని ప్రకాశం జిల్లాలో పార్టీని నిలబెట్టారు. అలాంటి బాలినేని ఇపుడు క్యాబినెట్ కు దూరమయ్యారు.
ఇక బంధువులు కాకపోయినా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు కూడా జగన్ కోసమే మంత్రిపదవులు వదులుకున్నారు. వాళ్ళకి మంత్రిపదవులు ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత రాజీనామాలు చేయించి రాజ్యసభ ఎంపీలను చేసి ఢిల్లీకి పంపేశారు.
మొదటినుండి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఉంటే వెనక బెంచీల్లోనో లేకపోతే సైలెంట్ గానో ఉన్నారంతే. పాదయాత్ర మొదలుపెట్టినపుడు రాయలసీమ రెడ్లంతా జగన్ వెంటే ఉన్నారు. వాళ్ళిచ్చిన ఊపువల్లే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పార్టీకి ఊపొచ్చింది.
ఆ ఊపువల్లే గుంటూరు, కోస్తా జిల్లాల్లో కూడా జనాలు బ్రహ్మరథం పట్టారు. అలాంటి రెడ్లను కూడా ఇపుడు పథకాలకు, కాంట్రాక్టులకు జగన్ దూరంగా పెట్టేశారనే చర్చ జరుగుతోంది. అంటే రెడ్లకు జగన్ ఫుల్లుగా సున్నం పెట్టినట్లే కదా అనే టాక్ పెరిగిపోతోంది. మరికొద్ది రోజులు ఇలాగే నడిస్తే రాబోయే రోజుల్లో వైసీపీలో రెడ్ల పరిస్ధితి ఏమిటనే విషయంలో చర్చ పెరిగిపోతోంది. మొత్తానికి రెడ్ల పరిస్దితి ఇంత అన్యాయం అయిపోయిందా అని వాపోతున్నారట.