అత్యంత శక్తివంతమైన స్థానంలో ఉన్నప్పుడు అంతకు మించిన అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. కీలకస్థానాల్లో ఉన్న వారు ప్రత్యేకించి మంచి చేయకున్నా ఫర్లేదు.. చెడు చేయకుంటే అదే పదివేలు. నేషనల్ స్టాక్ ఎక్స్జైంజ్ లో కీలక పాత్రను పోషించిన మాజీ సీఈవో చేయకూడదని తప్పు చేసేయటం తెలిసిందే.
పెను దుమారంగా మారిన ఆమె వైఖరి గడిచిన కొద్ది రోజులుగా వ్యాపార ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీసింది. కీలక స్థానంలో ఉన్న ఆమె.. ఒక అదృశ్య యోగి ప్రభావానికి గురి కావటం.. ఆయన చెప్పినట్లే చేయటం.. ఆ దెబ్బకు దారుణ పరిస్థితులుచోటు చేసుకోవటం.. తాజాగా ఆ ఆరాచక పుట్ట పగలటంతో చిత్ర రామక్రిష్ణ ఇబ్బందుల్లో పడ్డారు.
2018 ప్రారంభం నుంచి కో-లొకేషన్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా చిత్ర రామక్రిష్ణ తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటం ఒక అదృశ్య యోగి ప్రభావానికి గురైన ఆమె.. అతగాడు చెప్పినట్లుగా పనులు చేసి.. అనర్హులకు పెద్దపీట వేస్తూ నియమకాల్ని చేపట్టిన వైనం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఈమొయిల్ సంభాషణలు బయటకు రావటం పెను సంచలనంగా మారింది.
ఇంతకూ చిత్రను అంతలా ప్రభావితం చేసిన ఆ అదృశ్య యోగి ఎవరన్న ఆసక్తి అందరిలో వ్యక్తమైంది. దీనిపై సీబీఐ ఫోకస్ చేసి.. చివరకు ఆ అదృశ్య యోగి మరెవరో కాదని.. చిత్ర హయాంలో అమాంతం ఎదిగిన ఆనంద్ సుబ్రమణియన్ గా గుర్తించారు. ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించటం.. తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తు చేపట్టింది.
ఈ దర్యాప్తులోనే ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్ర రామకృష్ణకు సంబంధించిన సంచలన విషయాలు బయటకు వచ్చాయి. హిమాలయాల్లో ఉండే ఓ యోగి.. చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను కీలుబొమ్మలా ఉపయోగించుకుని ఎన్‌ఎస్‌ఈని నడిపించారని సెబీ గుర్తించింది. ఇంతకూ ఆ యోగి ఎవరన్న దానిపై లోతుగా విచారించిన సీబీఐకు.. ఒక మొయిల్ లో అజ్ఞాత యోగి.. మనిషైతే సుబ్రమణియన్ లా ఉంటానంటూ కనిపించిన మాటలు.. సదరు అదృశ్య యోగి ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది.
దీంతో.. అతడ్ని అరెస్టు చేసిన సీబీఐ.. శ్రీక్రిష్ణ జన్మస్థానానికి తరలించింది. అనంతరం చిత్రను అదుపులోకి తీసుకొని మూడు రోజులపాటు ఆమెను విచారించారు. ఆమె విచారణ సందర్భంగా ఒక సైకాలజిస్టు సేవల్ని కూడా తీసుకున్నారు. సీబీఐ అధికారులు వేసిన ప్రశ్నలకు చిత్ర సరైన సమాధానం ఇవ్వలేదని.. వారికి ఆమె సరిగా సహకరించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో చిత్ర నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాల్ని ఇవ్వకపోవటంతో చిత్రను సీబీఐ అరెస్టు చేసింది.
సీబీఐ విచారణకు ఏ మాత్రం సహకరించని చిత్ర తీరును చూసిన అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె మరీ ఇంత ముదురుకేసా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.