పీకేను కన్వీన్స్ చేయటానికి కేసీఆర్ చుక్కలు కనిపించాయా?

Update: 2022-03-02 23:30 GMT
పీకే అన్నంతనే పవన్ కల్యాణ్.. ప్రశాంత్ కిశోర్ ఇద్దరి పేర్లు గుర్తుకు వస్తుంటాయి. ఆసక్తికరమైన ఈ ఇద్దరు పీకేలు తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. వారికి సంబంధించిన సమాచారం.. వివరాలు పలు సందర్భాల్లో ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి.. కేసీఆర్ సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది.

టీఆర్ఎస్ పార్టీని అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. పార్టీ పరంగా ఎంత సుప్రీమోగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీలక ప్రెస్ మీట్ల వేళ.. సీనియర్ నేతల్ని పక్కన కూర్చోబెట్టుకుంటారే కానీ.. ఆయన ఏం చెబుతున్నారో.. మీడియా సమావేశానికి హాజరైన విలేకరులకు ఎంత తెలుసో.. కేసీఆర్ పక్కన కూర్చునే సీనియర్ నేతలకు అంతే తెలుసన్న మాట విన్నప్పుడు ఆశ్చర్యానికి గురి కాక మానదు.

అలాంటి కేసీఆర్.. తొలిసారి తన రోటీన్ తీరుకు భిన్నంగా వ్యవహరించారని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజీలను సిద్ధం చేసేందుకు పీకే ఓకే చెప్పటం.. కేసీఆర్ తరఫున పని చేయటానికి బాధ్యత తీసుకోవటం తెలిసిందే. అయితే.. దీనికి ముందు చాలానే కసరత్తు జరిగినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించటానికి ముందు.. కేసీఆర్ చాలానే ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

సాధారణంగా సీఎం కేసీఆర్ ఎవరితోనైనా భేటీ అయినప్పుడు.. వారు తమ విజన్ ను గులాబీ బాస్ కు తెలియజేసేందుకు వీలుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్లు సమర్పిస్తుంటారు. కానీ.. పీకే ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్నంగా కేసీఆరే ప్రత్యేకంగా ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను సిద్ధం చేయటం.. దాన్ని వివరిస్తూ చెప్పిన మాటలకు పీకే ఒక పట్టాన కన్వీన్స్ కాలేదని చెబుతున్నారు. గడిచిన రెండు దఫాలుగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల్లోఉన్న వ్యతిరేకత గురించి ప్రస్తావించటం.. దానికి అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఓపిగ్గా సమాధానం చెప్పటంతో పాటు.. పీకేను సమాధాన పరిచే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

సాధారణంగా ప్రెస్ మీట్ లో కానీ.. మీడియా ప్రముఖులతో చిట్ చాట్ సందర్భంలో కానీ తాను చెప్పాల్సిన విషయాల్నిమాత్రమే చెప్పి.. మిగిలిన వివరాల్ని.. ఎదుటి వ్యక్తుల నుంచి లాగే అలవాటున్న కేసీఆర్.. పీకే వద్ద మాత్రం అందుకు భిన్నంగా తన మనసును విప్పి చెప్పినట్లుగా చెబుతున్నారు.

డాక్టర్ దగ్గర.. లాయర్ దగ్గర ఏదీ దాచకూడదన్న సిద్ధాంతాన్ని కేసీఆర్ నూటికి నూరు శాతం ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఓపెన్ నెస్ కు పీకే ఫిదా అయ్యారని.. ఆయన విజన్ కు సంతోషపడటంతో పాటు.. ఆయనతో కలిసి పని చేసే అంశంపై ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ కు ఇప్పటివరకు ఎదురుకాని అనుభవాన్ని పీకే పరిచయం చేశారన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News