కొత్త జిల్లాల ఏర్పాటు స‌రే నిధులు ఎక్క‌డ ?

Update: 2022-03-14 05:30 GMT
ఇచ్చింది మూడు కోట్లు ..రంగులు వేయండి ..ఖ‌ర్చు చేయండి అని అంటారే స‌రిపోతుందా ఇదీ అధికారుల ప్ర‌శ్న. తాత్కాలిక‌మే క‌దా స‌ర్దుబాటు చేసుకోండి అని అంటున్నార‌న్న‌ది మ‌రో  వాద‌న.

ఇవీ ప్ర‌ధాన మీడియాలో హైలెట్ అవుతున్న వాద మ‌రియు ప్ర‌తివాద విష‌యాలు. సంబంధిత విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన వేళ  కొంద‌రు ఇంకొన్ని కూడా చెబుతున్నారు.సిబ్బంది విభ‌జ‌న‌కు ఇవాళ్టికీ ఓ స్ప‌ష్ట‌మ‌యిన వైఖ‌రి వెల్ల‌డి చేయ‌క‌పోవ‌డం మ‌రింత దిగ్బ్రాంతికి కార‌ణం అని అంటున్నారు.

ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు వాటి నిర్వ‌హ‌ణ‌కు కార్యాచ‌ర‌ణ ఒక‌టి ఆరంభం కానుంది. ఉగాది వేళ‌ల్లో  అంత‌టా జ‌గ‌న్ చెప్పిన విధంగా కొత్త కార్యాల‌యాలకు  చేరుకోవాల్సి ఉంది.ఇందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌ని విభ‌జ‌న సిబ్బంది విభ‌జ‌న అంటూ కొన్ని మార్గ నిర్దేశ‌కాలు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులు లేక‌పోయిన‌ప్ప‌టికీ కొన్ని అభ్యంత‌రాలు అయితే ఉన్నాయి.

వీటిని ప‌రిష్క‌రించే దిశ‌గా కూడా చాలా చోట్ల అడుగులు ప‌డ‌లేదు  అన్న‌ది వాస్త‌వం.ముఖ్యంగా రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటుకు సంబంధించి విన‌త‌లు వ‌చ్చాయి.వాటిపై కూడా స్ప‌ష్ట‌త లేదు. బాల‌య్య, రోజా లాంటి వారి విన్న‌పాలకు సంబంధించి ఇప్ప‌టికీ ఏ స్ప‌ష్ట‌త లేదు.ఏవీ ఇంత‌వ‌ర‌కూ క్లారిఫై కాలేదు. ఇవే కాదు జిల్లాల ఏర్పాటులో చాలా చోట్ల నిధులే ప్ర‌ధాన అడ్డంకి.

జ‌గ‌న్ సంక‌ల్పించిన విధానంలో భాగంగా ఇవాళ 26 జిల్లాల ఆంధ్రావ‌ని రాబోతోంది. ఆ కూర్పులో భాగంగా విశాఖ జిల్లా మూడు జిల్లాలుగా మారింది.మ‌న్యం జిల్లాకు నిధుల కేటాయింపు బాలేదు అన్న వార్త‌లూ వ‌స్తున్నాయి.అన‌కాప‌ల్లి కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు న‌ర్సీప‌ట్నంను జిల్లా కేంద్రం చేయాల‌ని మొత్తుకుంటున్నా విన‌లేదు.

ఇవే కాదు చాలా ఉన్నాయి. అయినా కూడా జ‌గ‌న్ త‌న మొండి ప‌ట్టుద‌ల అస్స‌లు వీడ‌డం లేదు. మ‌న్యం జిల్లా పేరుతో ఐటీడీఏ అన్న‌ది శ్రీ‌కాకుళంకు దూరం అవుతోంది.అయినా కూడా ఐటీడీఏల కూర్పు, కొత్త జెడ్పీల కూర్పు, స్టేష‌న్ హౌస్ ల ప‌రిధి ఇవేవీ తేల్చ‌కుండానే ఓ అస‌మ‌గ్ర విభ‌జ‌న‌కు జ‌గ‌న్ నాంది ప‌లికార‌న్న వాద‌న ఒక‌టి స్ప‌ష్టంగా వ‌స్తోంది.
Tags:    

Similar News