#RussiaUkrainewar: భారత విద్యార్థులు, పౌరులకు కేంద్రం కీలక సూచనలు

Update: 2022-02-25 12:30 GMT
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో అక్కడున్న విదేశీయులకు ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రధానంగా ఈ యుద్ధంతో భారీగా అక్కడ చదువుకుంటున్న వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  ఉక్రెయిన్ లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం. ఈ మేరకు హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో కేంద్రప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది ప్రభుత్వం.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపునకు కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసిందని పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హుజూర్ధ్, చెర్నీ వేస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.

స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు జట్టుగా, బృందాలుగా బయలు దేరాలని హంగేరి రాయబార కార్యాలయం పేర్కొంది. భారతీయ పౌరులు, విద్యార్థులు పాస్ పోర్టులు, డాలర్లు (ప్రధానంగా అమెరికా డాలర్లు) అత్యవసర ఖర్చుల కోసం.. ఇతర అవసరాల కోసం వెంట ఉంచుకోవాలని సూచించింది.

ఇక కరోనా వ్యాక్సిన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. భారత జాతీయజెండా ప్రింట్ కాపీలను తాము ప్రయాణిస్తున్న వాహనాలపై అతికించాలని సూచించింది.

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న బాంబుల వర్షంతో ఇక్కడి ఇంటర్నెట్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం దొరకడం లేదు. అయితే స్థానికంగా అండగా నిలవాల్సిన అధికారులు తమను నిండా ముంచేశారని ఆవేదన చెందుతున్నారు. యుద్ధం వస్తుందన్నవిషయం అవాస్తవమని చెబుతూ తప్పుడు సమాచారం చేశారన్నారు. అందువల్లే తమ దేశాలు వెనక్కి రమ్మని పిలిచినా కొందరు  తిరుగుముఖం పట్టలేదు. కానీ ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కనీస సరుకులు కూడా నిల్వచేసుకోకుండానే యుద్ధం సాగుతుండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఉక్రెయిన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 1500 మంది ఉక్రెయిన్ విమానాశ్రయంలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా ఉభయ రాష్ట్రాల నుంచి ఉక్రెయిన్ కు ఏటా వందలాది మంది మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్తున్నారు. అయితే ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులను వెనక్కి వెళ్లాలని సూచించారు. కానీ వారు అక్కడి నుంచి వెనక్కి రావడానికి నిరాసక్తి చూపిస్తున్నారు. అందుకు విమాన ఛార్జీలు భారీగా ఉండడమే కారణమని అంటున్నారు. ఇక కొందరు తిరిగి వచ్చేందుకు రెడీ అయినా మార్చి వరకు గానీ టిక్కెట్లు దొరకలేదు.
Tags:    

Similar News