రష్యా సేనలను ప్రతిఘటించడానికి ఉక్రెయిన్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఎలాగైనా దేశాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ అన్ని విధాల ప్లాన్ చేస్తోంది. అందుకే దూసుకొస్తున్న రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఖైదీలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. జైళ్లలో ఉన్న వ్యక్తుల్లో సైనిక నేపథ్యం ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. వివిధ కేసుల్లో భాగంగా ఖైదీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రష్యా భీకర యుద్ధాన్ని ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ శతవిధాల కృషి చేస్తోంది. అందుకే సైనిక నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరినీ యుద్ధ భూమిలోకి దించుతుంది. ఈ నేపథ్యంలోనే జైల్లో ఖైదీలుగా ఉన్న సైనికులను విడుదల చేసింది. వారంతా కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. తమ దేశ రక్షణ కోసం రష్యాతో పోరాటం చేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని నేషనల్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
ఈ యుద్ధాన్ని జీ 7 దేశాలు ఖండించాయి. రష్యా దురాక్రమణ తీరును తప్పుబట్టారు. ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీని ఇచ్చాయి. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబాకు మాట ఇచ్చాయి. ఆయనతో జీ 7 దేశాల విదేశాంగ మంత్రులు వర్చువల్ గా చర్చించారు.
ఉక్రెయిన్ కు భద్రత, ఆర్థిక చేయూతనివ్వాలని తీర్మానించాయి. ఆ దేశానికి ఆయుధాలను అందించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. స్ట్రింగర్ క్షిపణులను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రష్యా తీరును నాటో దేశాలు తప్పుబడుతున్నాయి. ఉక్రెయిన్ కు సాయం చేయడానికి ఒక్కొక్కటి ముందుకు వస్తున్నాయి. ఆర్థిక, మానవత సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించాయి.
మరోవైపు రష్యా-ఉక్రెయిన్ చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఉక్రెయిన్ బృందం బెలారస్ కు చేరుకుంది. తక్షణమే యుద్ధం విరమించాలనేది ముఖ్య ఉద్దేశమని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తీసుకు వస్తున్నారు. ఆపరేషన్ గంగ పేరుతో అందరినీ స్వదేశానికి తీసుకొస్తున్నారు. ప్రతి భారతీయుడిని క్షేమంగా భారత్ కు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చింది. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని సూచించింది.