ఉక్రెయిన్ విడిచి రానంటున్న ఆంధ్ర యువకుడు.. పులి కారణం?

Update: 2022-03-05 09:29 GMT
రష్యా ప్రకటించిన యుద్ధం లో చాలా మంది పౌరులు ఇప్పటికే ప్రాణాలు విడిచారు. మరి కొందరు అయితే దేశం విడిచి ఇతర దేశాలకు పారిపోతున్నారు.  ప్రతి ఒక్కరిలో ప్రాణ భయం ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఏ బాంబు మీద పడుతుందో అని ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. గృహ సముదాయాల్లో ఉండే మరి కొందరు అయితే రష్యా ప్రయోగించే క్షిపణులకు  బలి కావడం ఖాయం అని  భావిస్తున్నారు. అందుకే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కి మీ మేర కాలి నడకు ప్రయాణిస్తూ... ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నారు.
 
ఇలా చాలా మంది తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఉక్రెయిన్ ను దాటి బయట దేశాలకు వస్తుంటే ఓ తెలుగు యువకుడు మాత్రం ఎంతటి యుద్ధం వచ్చినా సరే ఉక్రెయిన్ నుంచి కదిలేది లేదు అని అంటున్నాడు. ఇందుకు ఆ యువకుడు చెప్తున్న కారణాన్ని విని ఆశ్చర్య పోతున్నారు. రెండు దేశాలు పోటా పోటీగా యుద్ధానికి దిగినా సరే ఆ యువకుడు మాత్రం తమకడం లేదు. ఉక్రెయిన్ ను దాటి వచ్చే సమస్యే లేదు అని అంటున్నాడు.

ఆ  యువకుడు పేరే కుమార్. ఇతనిది ఆంధ్రప్రదేశ్ లోని తణుకు.  అయితే ఈ వ్యక్తి ఉక్రెయిన్ ను విడిచి రాకపోవడానికి కారణం అతని దగ్గర ఉన్న చిరుత పులి. కుమార్ ఓ చిరుత పులి ని తన పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నాడు. దీని కారణంగా ఆ వ్యక్తి దేశం విడిచి పెట్టి రాలేక పోతున్నాడు అని చెప్తున్నాడు.
 
ఉక్రెయిన్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నా కుమార్ యూట్యూబ్ లోని చాలా వీడియోల్లో కనిపించాడు. ముఖ్యంగా జాగ్వార్ కుమార్‌ చాలా మందికి అతను తెలుసు.  దీనికి కారణం లేకుపోలేదు.

కుమార్ కు మొదటి నుంచి కూడా పులుల అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తాను ఓ పులిని పెంచుకున్నాడు. తన అభిమాన నటుడు అయిన  చిరంజీవి లంకేశ్వరుడు చిత్రంలో పెంపుడు జంతువుగా ఓ చిరుత పులిని పెంచుకోవడం చూసిన నాటి నుంచి తనకు కూడా ఇలాంటి చిరుత పులని పెంచుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు.

ఇందుకోసంగా ఆ చిరుతను పెంచుతున్నట్లు తెలిపాడు.  దీనికోం ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందినట్లు తెలిపాడు. అయితే యుద్ధం కారణంగా అతని చుట్టూ పక్కన ఉండే వారు అందరూ వెళ్లిన కుమార్ మాత్రం అక్కడే పులితో ఉన్నారు. ప్రాణాల మీదకు వచ్చినా సరే పులితో నే బయటకు వస్తాను అని చెప్తున్నాడు.
Tags:    

Similar News