సోషల్ మీడియాతో రాజకీయ అరాచకం: సోనియా ఆక్షేపణ

Update: 2022-03-16 10:30 GMT
సోషల్ మీడియాపై సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ విద్వేష వ్యాపకాలుగా మారాయని.. బీజేపీ లాంటి పార్టీలకు సహకరిస్తూ అరాచక రాజకీయాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాను ఉద్దేశించి జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్ సభ జీరో అవర్ లో మాట్లాడిన ఆమె.. ఫేస్ బుక్ , ట్విట్టర్ విద్వేష వ్యాపకాలుగా మారాయని.. బీజేపీ లాంటి పార్టీలకు సహకరిస్తూ అరాచక రాజకీయాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్, అల్ జజీరా, ది రిపోర్టర్ లాంటి మీడియా సంస్థలు రాసిన ఇన్వెస్టిగేషన్ కథనాలను సోనియా ప్రస్తావించారు.

లోక్ సభ జీరో అవర్ లో ఇవాళ సోనియాగాంధీ మాట్లాడారు. ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా వ్యవస్థలు చేస్తున్న రాజకీయాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫేస్ బుక్ విద్వేషాన్ని పెంచుతున్నట్టు ఆమె ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన అవకాశం ఇవ్వడం లేదని ఫేస్ బుక్ ను ఆమె నిందించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ లతో టార్గెట్ చేస్తున్నారని సోనియా ఆరోపించారు. ఎన్నికల ప్రకటనల కోసం ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి చవకైన ఆఫర్లను ఫేస్ బుక్ అందించిందని రిపోర్టులో వెల్లడైనట్లు సోనియా గుర్తు చేశారు.

గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు అన్ని రాజకీయ పార్టీలకు సమ న్యాయం కల్పించడం లేదని సోనియా విమర్శించారు. రూల్స్ ను బ్రేక్ చేసి మరీ మత విద్వేషాలను ఫేస్ బుక్ రెచ్చగొడుతున్నట్లు సోనియా ఆరోపించారు. ఫేస్ బుక్ చేపడుతున్న అరాచక రాజకీయాలకు చరమగీతం పాడాలని ఆమె డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా సంస్థలు ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేస్తున్నాయని సోనియా ఆఱోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫేస్ బుక్, ట్విట్టర్ పనిచేస్తున్నాయన్నారు. ఫేస్ బుక్ కథనాలన్నీ అధికార పార్టీలకు ఉపయోగపడుతున్నాయని.. ప్రభుత్వానికి వ్యతిరేక గళాలను అణిచివేస్తున్నారని.. బీజేపీతో ఫేస్ బుక్ కుదుర్చుకున్న ఒప్పందం సరికాదన్నారు.
Tags:    

Similar News