టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను ఉతికారేస్తూ భార‌తి లేఖ‌!

Update: 2022-03-23 14:30 GMT
ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల్లో అధికార వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ, జ‌న‌సేన అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించాలంటే పొత్తుల అవ‌స‌రం ఉంద‌ని ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌నసేన పొత్తు క‌ట్టడం ఖాయమ‌నే అభిప్రాయాలున్నాయి. 2024లో జ‌గ‌న్‌కు ప్ర‌ధానంగా ఈ రెండు పార్టీల పొత్తుతోనే స‌వాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది.

అందుకే వైసీపీ నేత‌లు.. ఈ రెండు పార్టీల‌పై కౌంట‌ర్లు వేస్తూ సాగుతున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ భార్య‌, సాక్షి మీడియా గ్రూప్ ఛైర్‌ప‌ర్స‌న్ వైఎస్ భార‌తి కూడా టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తూ ఓ లేఖ రాశారంటూ వార్త‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. భార‌తి పేరుతో ఉన్న ఆ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఎప్పుడూ త‌న భ‌ర్త రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోని భార‌తి ఇలా లేఖ రాయ‌డ‌మేంట‌ని విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే అది ఫేక్ అని కొట్టిపాడేస్తున్నారు. త‌న వ్యాపారాలేవో తాను చూసుకుంటున్న ఆమె ఇలా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తూ లేఖ రాసే అవ‌కాశ‌మే లేద‌ని అది క‌చ్చితంగా ఎవ‌రో తెలీని వాళ్లు చేశార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ అభిమానులు ఈ ప‌ని చేసి ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఒక‌వేళ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై భారతి విమ‌ర్శ‌లు చేయాల‌నుకుంటే త‌న సొంత ప‌త్రిక సాక్షిలో కానీ లేదా ఛానెల్‌లో కానీ కామెంట్లు చేసేవార‌ని అంతే కానీ ఇలా లేఖ రాయాల్సిన అవ‌స‌రం లేద‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉతికారేస్తూ ఆ లేఖ‌లో వ్యాఖ్యాలున్నాయి. దీంతో ఆ లేఖ‌ను భార‌తి రాసే అవ‌కాశామే లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. సిఖండి, ఏమి పీకుతాడు, పెంట రాజ‌కీయాలు, వెధ‌వ ఆలోచ‌న‌లు లాంటి ప‌దాలు వాడి లేఖ రాయాల్సిన అవ‌స‌రం భార‌తికి లేద‌ని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఎలాంటి ఎన్నిక‌లు కూడా లేవు. కాబ‌ట్టి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను టార్గెట్ చేస్తూ ఆమె ఇలాంటి ప‌ని చేసే ఆస్కార‌మే లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఆమె పేరుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన లేఖ మాత్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంద‌ని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News