నిర్భయ దోషుల లాయర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-03-20 06:30 GMT
ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడింది. ఏడేళ్ల సుధీర్ఘ విరామం అనంతరం నిర్భయ కుటుంబానికి న్యాయం జరిగింది. దీనిపై దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేయగా.. నిర్భయ తరుఫున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్భయ తల్లిపై అతడు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

న్యాయ వ్యవస్థలోని పలు లొసుగులు వాడుకుంటూ ఏడేళ్ల పాటు నిర్భయ దోషులు నలుగురికి శిక్ష పడకుండా లాయర్ ఏపీ సింగ్ అడ్డుకుంటూ వచ్చారు. తాజాగా ఉరిశిక్ష పడడంతో లాయర్ ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ నిర్భయ తల్లిపై కామెంట్ చేశారు.

ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్భయ తల్లిని శిక్షించాలి. రాత్రి 12 గంటల వరకు తన కూతురు ఎక్కడుందో.. ఎవరితో ఉందో తెలియని నిర్భయ తల్లి ఆశాదేవిని శిక్షించాలి’ అని డిమాండ్ చేశాడు. కరోనా దేశంలో ప్రబలుతుంటే మాస్కులు అందించలేని కేంద్రం.. ఉరితాళ్లను మాత్రం వేగంగా సిద్ధం చేస్తోందని అతడు విమర్శించాడు.

నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అసలు ముందు ఏపీ సింగ్ ను ఉరితీయాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Tags:    

Similar News