మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. మూడు రాజధానులపై ఏపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకుంది. మూడురాజధానుల బిల్లును ఉపసంహరించుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఈ మేరకు అడ్వకేట్ జనరల్ కు హైకోర్టుకు తెలిపారు.
సోమవారం ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం అత్యవసరంగా జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులపై ఏపీ సర్కార్ తీసుకొన్న చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా అడ్వకేట్ జనరల్ ఇవాళ ఏపీ హైకోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై జగన్ సర్కార్ ముందుకు పోతామని గతంలో స్పష్టం చేసింది.
మూడు రాజధానుల అంశంపై అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు,పలు సంస్థలు కూడా ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై ఏపీ హైకోర్టు రోజువారీ విచారణను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో మూడు రాజధానులపై తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకొన్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ విషయమై అసెంబ్లీలో జగన్ ప్రకటన చేస్తారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం హైకోర్టులో పాస్ కాదని.. అందులో న్యాయచిక్కులు ఉన్నాయని.. ఇప్పుడు బిల్లు వెనక్కి తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని హైకోర్టు సీనియర్ న్యాయవాదులు అన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మూడు రాజధానుల బిల్లు లోపభూయిష్టం అని.. ముందు నుంచే వాదిస్తున్నామని.. ఇప్పుడు జగన్ తీసుకున్నది సరైన నిర్ణయమని న్యాయవాదులు అన్నారు. అమరావతి రైతుల పిటీషన్లు ఇప్పుడు వృథా అవుతాయని పేర్కొన్నారు.