వైసీపీకి స‌వాళ్లుగా మారుతున్న నేత‌లు.. ఎవ‌రు? ఎందుకు?

Update: 2021-11-18 23:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీకి కొందరు నాయ‌కులు స‌వాళ్లు రువ్వుతున్నారు. పార్టీ ప‌రిస్థితి బాగున్న‌ట్టుగా ఉన్న‌ప్ప‌టికీ.. వాస్త‌వానికి అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో నాయ‌కులు.. పొరు చేసుకుంటున్నారు.

దీంతో అలాంటి చోట్ల పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం తీసుకుంటే.. ఇక్క‌డ స్థానిక ఎమ్మెల్యేకు, నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డికి మ‌ధ్య తీవ్ర వివాదాలు న‌డుస్తున్నాయి. అంతేకాదు.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నారు.

ప‌లితంగా ఇక్క‌డ పార్టీ ఇక్క‌డ ద‌శ దిశ లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం 12 మునిసిపా లిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగి ఫ‌లితం విడుద‌లైతే.. మొత్తం 11 మునిసిపాలిటీల్లో.. వైసీపీ విజ‌యం ద‌క్కించు కుంది. కానీ, ఇద్ద‌రు మంత్రులు.. ఎమ్మెల్యేల బ‌ల‌గం ఉన్న ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన ద‌ర్శి నియోజ క‌వ‌ర్గంలో టీడీపీవిజ‌యం ద‌క్కించుకుంది. వాస్త‌వానికి ఇక్కడ టీడీపీ నుంచి గ‌తంలో గెలిచిన బ‌ల‌మైన నాయ‌కుడు.. శిద్దా రాఘ‌వ‌రావు సైతం.. వైసీపీలోనే ఉన్నారు.

అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ వైసీపీ పుంజుకోలేక పోయింది. దీనికి కార‌ణం ఏంటి? రాష్ట్రంలో ఎన్నో గెలిచినా.. ద‌ర్శి ప‌రాభ‌వం మాత్రం వైసీపీకి పంటికింద రాయిగా మారింద‌నే చెప్పాలి. గ‌త మార్చిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

ఆ స‌మ‌యంలోనూ.. అక్క‌డి ఎమ్మెల్యే దూకుడుకే వైసీపీని ఓట‌మి బాట ప‌ట్టించింద‌నే భావ‌న వ్య‌క్త‌మైంది. అంటే.. పైచేయి సాధించాల‌నే వ్యూహంలో భాగంగా క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌ను ప‌ట్టిం చుకోలేదు. దీంతోనే తాడిప‌త్రిలో వైసీపీ ఓడిపోయింది.

ఇక‌, ఇప్పుడు ఇదే సీన్‌.. ద‌ర్శిలోనూ వైసీపీకి క‌నిపించింది. ఇక్క‌డ సొంత పార్టీ నేత‌లే.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి కోసం ప్ర‌య‌త్నించ‌డం.. కొంద‌రు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌డం.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి.. ద‌ర్శి ప‌రాజ‌యా నికి కార‌ణాలుగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఇలానే ప‌రిస్థితి కొన‌సాగితే.. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక్ల‌లో ఈ సీటుకోల్పోయినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.



Tags:    

Similar News