హస్తిన చేరిన మండలి రద్దు తీర్మానం!

Update: 2020-01-28 12:54 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మండలిని రద్దు చేస్తూ తీర్మానం పెట్టి ..ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.  ఆ తరువాత  వెంటనే ఈ  తీర్మానం ప్రతిని - ఓటింగ్ వివరాలకు సంబంధించిన పూర్తి అంశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శాసనసభ సచివాలయం పంపింది. శాసనసభ సచివాలయం నుంచి బిల్లులకు సంబంధించిన అంశాలను అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి పంపింది.

కేంద్ర న్యాయశాఖతో పాటు హోంశాఖకు ఈ తీర్మానం అందింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇందుకు సంబంధించిన ప్రతిని పంపింది. దీనితో ఈ తీర్మానం పై కేంద్రం కేబినెట్ లో తీర్మానం చేసిన అనంతరం పార్లమెంటులో రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం మండలి రద్దుకు బిల్లు పెడుతుంది. అక్కడ పాస్ అయిన తరువాత - ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకి వెళ్తుంది - అయన కూడా ఆమోదించి - నోటిఫికేషన్‌ జారీ చేస్తే అప్పుడు మండలి రద్దు అవుతుంది. అప్పటివరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లూ మండలికి వెళ్లాల్సిందే. 
Tags:    

Similar News